హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో జాబ్స్‌‌కు అప్లై చేసుకోండి : వెంకటరమణ

హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో జాబ్స్‌‌కు అప్లై చేసుకోండి : వెంకటరమణ

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్‌‌ జిల్లా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో వివిధ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లై చేసుకోవాలని డీఎంహెచ్‌‌వో వెంకటరమణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేషనల్​హెల్త్​మిషన్‌‌లో భాగంగా డాక్టర్లు, నర్సులు

ఇతర పారా మెడికల్‌‌ సిబ్బంది పోస్టులు కలిపి మొత్తం 32 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అర్హులైన వారు మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు అప్లికేషన్లు అందజేయాలని సూచించారు. అలాగే హనుమకొండ జిల్లా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో సైతం 31 పోస్టులకు అప్లై చేసుకోవాలని జిల్లా ఆఫీసర్లు తెలిపారు.