కౌటాల పీహెచ్​సీ సమస్యలు పరిష్కరిస్తాం : తుకారాం భట్

కౌటాల పీహెచ్​సీ సమస్యలు పరిష్కరిస్తాం : తుకారాం భట్
  • వెలుగు కథనంపై స్పందించిన కలెక్టర్ 
  • పీహెచ్ సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

కాగజ్ నగర్, వెలుగు: కౌటాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సహా జిల్లాలోని అన్ని సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం భట్ అన్నారు. గురువారం ‘వెలుగు’ పేపర్​లో ప్రచురితమైన ‘నాడు బెస్ట్ పీహెచ్ సీ.. నేడు డాక్టర్లు లేని దుస్థితి’ కథనంపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశాల మేరకు డీఎం అండ్​హెచ్ ఓ కౌటాల పీహెచ్ సీని పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో కలిసి మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతమున్న స్టాఫ్, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. 

గతంలో మెరుగైన వైద్య సేవలు అందించిన పీహెచ్ సీ సేవలు ఇప్పుడు 8 గంటలకు తగ్గడంతో ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. స్టాఫ్ ను పెంచేందుకు కలెక్టర్ కు నివేదిక అందిస్తామనిన్నారు. ఈ సందర్భంగా పీహెచ్ సీలో మెరుగైన సేవలు అందేలా చూడాలని బోదంపల్లి మాజీ ఎంపీటీసీ మోతీరాం, గుడ్ల బోరి మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గౌడ్ డీఎంహెచ్ ఓకు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, డాక్టర్లు నవత, అజీముద్దిన్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.