
ఓ వైపు అన్నతో విభేదాలు, మరోవైపు బీజేపీలోకి వెళుతున్నట్లు అసత్యప్రచారం జరగడంతో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
తమిళనాడు ఎమ్మెల్యే డీఎంకే ఎమ్మెల్యే పూన్ గోతాయ్ అలాది అరుణకు అదే పార్టీలో ఉన్న తన అన్నకు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. డీఎంకే నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అరుణ సోదరుడు హాజరయ్యాడు. అదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అరుణ పై సోదరుడి అనుచరులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశంలో స్టేజ్ పై ఏర్పాటు చేసిన కుర్చీలో అన్నపక్కనే ఆమెకు కేటాయించడం, ప్రత్యర్ధులు విమర్శలు చేయడంతో, స్టేజ్ ఎక్కేందుకు నిరాకరించడంతో తనకు అవమానం జరిగిందని ఫీలైన ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం షిఫి ఆస్పత్రి ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆమె ఆరోగ్యం సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.
కాగా ఇటీవల కాంగ్రెస్ నేత సినీ నటి కుష్బూ బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అరుణ కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ప్రచారంపై డీఎంకే ఎమ్మెల్యే ఎమ్మెల్యే డీఎంకే ఎమ్మెల్యే పూన్ గోతాయ్ అలాది అరుణ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.