
హైదరాబాద్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నమోదైన కేసులో బీఎస్పీ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ కుమారుడు పునీత్‌పై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్, ఆయన కొడుకు ఆర్‌ఎస్.పునీత్ వారి అనుచరులతో కలిసి తనపై దాడికి యత్నించారని, రూ.25 వేలు లాక్కున్నారని కాగజ్‌నగర్‌కు చెందిన డ్రైవర్ అలీమ్ ఖాన్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో పోలీసులు జరుపుతున్న విచారణను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఎస్. పునీత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పునీత్ పిటిషన్ ద్వారా కోర్టును కోరారు. పునీత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది.