ఎస్​బీఐ కేవైసీ మెసేజ్​ వచ్చిందా... క్లిక్​ చేయొద్దు...

ఎస్​బీఐ కేవైసీ మెసేజ్​ వచ్చిందా... క్లిక్​ చేయొద్దు...
  • అకౌంట్​ ఖాళీ అవుతుంది.. స్టేట్​బ్యాంక్​ హెచ్చరిక

బిజినెస్​ డెస్క్​, వెలుగు: మీ కేవైసీ (నో యువర్​ కస్టమర్​) డిటెయిల్స్​ను 10 నిమిషాలలో అప్​డేట్​ చేయమంటూ లింక్స్​తో వచ్చే మెసేజ్​లను క్లిక్​ చేయొద్దని కస్టమర్లను హెచ్చరిస్తోంది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ). కేవైసీ అప్​డేషన్​ పేరిట కొత్త స్కామ్​కు మోసగాళ్లు పాల్పడుతున్నారని సూచించింది. బ్యాంకు రిప్రజెంటేటివ్​ని అని చెప్పుకుంటూ మోసగాడు మెసేజ్​ పంపించి, ఆ తర్వాత కస్టమర్ల పర్సనల్​ డిటెయిల్స్​ కొల్లగొడుతున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ ఆన్​లైన్​ మోసాలు జోరందుకున్నాయి. ఎక్కువ మంది ట్రాన్సాక్షన్లను మొబైల్​ వ్యాలెట్లు, యూపిఐ వంటి వాటి ద్వారా డిజిటల్​గానే చేస్తుండటం మోసగాళ్లకు అనువుగా మారింది. కేవైసీ అప్​డేషన్​ పేరిట మోసగాళ్లు విసిరే వలలో పడొద్దని, లింక్స్​తో  అలాంటి మెసేజ్​లు  వస్తే వెంటనే సైబర్​క్రైమ్​.జీవోవీ.ఇన్​కు రిపోర్టు చేయమని కూడా ఎస్​బీఐ సలహా ఇస్తోంది. ఏదైనా లింక్​ను క్లిక్​ చేసే ముందు మరొక్కసారి ఆలోచించమని సూచిస్తోంది. ఎందుకంటే బ్యాంకు ఎలాంటి లింక్స్​ను పంపించదు. ఎవరితోనూ మొబైల్​ నెంబర్​ను, కాన్ఫిడెన్షియల్​ డేటాను షేర్​ చేసుకోవద్దని కూడా తమ కస్టమర్లను  బ్యాంకు కోరుతోంది.