
- ఖమ్మం జిల్లా భాగ్యనగర్ తండాలో ఘటన
కారేపల్లి, వెలుగు: జాబ్ ఇవ్వడం లేదని విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో సబ్ స్టేషన్ కు స్థలాన్ని ఇచ్చేటప్పుడు భూదాత లక్ష్మి కుటుంబంలో ఒకరికి జాబ్ కల్పిస్తామని గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఎంతకూ జాబ్ ఇవ్వకపోవడంతో భూదాత లక్ష్మి శుక్రవారం సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపి వేయించి గేటుకు తాళం వేశారు. దీంతో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెళ్లి ప్రత్యామ్నాయంగా కారేపల్లి క్రాస్ రోడ్ సబ్ స్టేషన్ నుంచి సరఫరా చేశారు. హామీ అమలు చేస్తేనే తాళం తీస్తానని స్థల దాత లక్ష్మి అక్కడినుంచి వెళ్లిపోయింది.