విచారణ పూర్తయ్యే వరకు .. ముస్లింల రిజర్వేషన్ల రద్దును అమలు చేయం

విచారణ పూర్తయ్యే వరకు  .. ముస్లింల రిజర్వేషన్ల రద్దును అమలు చేయం

ధార్వాడ్: ముస్లింల 4% రిజర్వేషన్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తుతం అమలు చేయడంలేదని కర్నాటక సీఎం బసవరాజ్​ బొమ్మై మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. రిజర్వేషన్ల రద్దు నిర్ణయాన్ని మే 9 వరకు అమలుచేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బొమ్మై స్పందించారు. "విచారణ పూర్తయ్యేవరకు మేము దానిని ముందుకు తీసుకెళ్లవద్దని నిర్ణయించుకున్నాము" అని బొమ్మై చెప్పారు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని వొక్కలిగలు, లింగాయత్‌‌లకు 2% చొప్పున కేటాయించింది.