స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అప్పుడే హైజీన్ , హెల్దీగా ఉంటాం.

• వేడినీళ్ల స్నానం బాడీకి రిలాక్సేషన్ ఇస్తుందన్న మాట నిజమే. కానీ, దానివల్ల సమస్యలూ అన్నే ఉన్నాయి. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే స్కిన్ లోని నేచురల్ ఆయిల్స్ అన్నీ పోయి, చర్మం డ్రైగా మారుతుంది. అందుకే వీలైనంతవరకు స్నానానికి చన్నీళ్లే వాడాలి. తప్పనిసరి అయితే గోరు వెచ్చని నీళ్ల వరకు ఓకే కానీ, మరీ వేడినీళ్లు వద్దే వద్దు. 
* యాంటీ బ్యాక్టీరియల్ చర్మంపై ఉండే మంచి బ్యాక్టీరియాని కూడా చంపుతాయి. అలాగే వీటిల్లోని కెమికల్స్ లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. ఈ సబ్బుల్లో ఉండే ఎండోక్రైన్ లేదా డిస్ట్రక్టర్స్ హార్మోన్స్ పనితీరుకి ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ లేదా బాడీ నుంచి దుర్వాసన వస్తున్నప్పుడే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకే.

కొన్ని సబ్బుల లేబుల్స్ పై యాంటీ బ్యాక్టీరియల్ అన్నది కనిపించదు. కానీ దానికి బదులుగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలున్న ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ అని ఉంటుంది. వీటికి కూడా దూరంగా ఉండాలి. అయితే మార్కెట్లో ఉన్న అన్ని బాడీ సబ్బులు క్రిముల నుంచి కాపాడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటు న్నారు.
• చాలామంది స్నానానికి బాడీ స్పాంజ్లు, లూఫాస్ వాడుతుంటారు. కానీ, వీటివల్ల చర్మం మరింత మురికి అవుతుంది. ఎందుకంటే వీటిని శరీరానికి రుద్దినప్పుడు బాడీ లోని దుమ్ము, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ వాటిల్లోకి చొచ్చుకుపోతాయి. పైగా ఇవి పూర్తిగా ఆరవు. దాంతో వీటిపై మరింత బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. అందుకే స్పాంజ్ కి వీలైంత దూరంగా ఉండాలి. వీటికి బదులు స్నానం చేశాక ఫ్రెష్ టవల్ తో తుడుచుకుంటే సరిపోతుంది. 

* శరీరంలో దుర్వాసనకి కారణమయ్యే బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందేది చంకలు, గజ్జల్లోనే. అందుకే స్నానం చేసేటప్పడు వాటి క్లీనింగ్ కి కాస్త ఎక్కువ టైం కేటాయించాలి. చెవి, మెడ వెనక భాగాలు బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే మన శరీరంలో చాలాచోట్ల చర్మం ముడతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, తొడలు, గజ్జల దగ్గర చర్మం ముడతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడతలు ఉన్నచోట్ల పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే వారానికి రెండు నుంచి మూడుసార్లు తప్పనిసరిగా తలస్నానం చేయాలి.