Good Food: అర్దరాత్రి ఆకలవుతుందా.. ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసుకోండి..!

Good Food: అర్దరాత్రి ఆకలవుతుందా.. ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసుకోండి..!

అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం కొందరికి అలవాటు. సరిగ్గా నిద్రపట్టకపోవడం, సెల్​ ఫోన్ వాడడం వంటి కారణాల వల్ల లేటుగా ని ద్రపోతారు. దాంతో రాత్రిపూట ఆకలేస్తుంటుంది. అప్పుడు ఏది పడితే అది తింటుంటారు. ఇది ఆరో గ్యానికి మంచిది కాదు. రాత్రిపూట కొన్ని రకాల చి రుతిళ్లనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు, ఇతర స్నాక్స్ తినొచ్చు. వీటి వల్ల మంచి నిద్రపట్టడంతోపాటు, త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
  • ఉప్పు లేకుండా చేసిన పాప్​ కార్న్ తినాలి. అర్ధరాత్రి ఆకలైతే ఓ కప్పు ఇలాంటి పాప్​ కార్న్ తింటే మంచిది.
  • ఇవి త్వరగా జీర్ణమవడమే కాకుండా, కొవ్వు కూడా
  • ఉడకబెట్టిన కోడిగుడ్డు ఒకటి తీసుకుంటే మంచిది.
  • దీనివల్ల సగటున 75 క్యాలరీల శక్తి లభిస్తుంది.
  • కూరగాయలు, పండ్ల ముక్కల్ని తీసుకోవడం అన్నింటికంటే ఉత్తమం. వెజ్ లేదా ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల అదనపు కొవ్వు చేరదు. ఒకటి లేదా రెండు అరటి పండ్లు తిన్నా చాలు.
  • ఈజీగా దొరుకుతాయి కదా అని బేకరీ ఫుడ్స్, స్వీట్లు, చిప్స్ వంటి వాటిని తినకండి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
  • స్పైసీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అలాగే వేడిగా ఉండే ఆహార పదార్ధాలకు కూడా దూరంగా ఉండాలి

వెలుగు, లైఫ్​