Weekend Movies: ఈ వారం (OCT27-NOV 2) థియేటర్/ ఓటీటీ సినిమాలు.. ఆడియన్స్కు మాస్ విందు గ్యారెంటీ..

Weekend Movies: ఈ వారం (OCT27-NOV 2)  థియేటర్/ ఓటీటీ సినిమాలు.. ఆడియన్స్కు మాస్ విందు గ్యారెంటీ..

ఎప్పటిలాగే ఈ వారం (OCT27 నుంచి NOV 2) కూడా థియేటర్/ఓటీటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే, గత వారాలకు భిన్నంగా, కొంచెం మసాలా బాగా దట్టించి, మాస్ విందు ఇచ్చేలా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిన కొత్త కంటెంట్ సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా.. మైథికల్, యాక్షన్, డ్రామా, ఫాంటసీ, ఫీల్‌గుడ్‌, హారర్ జోనర్ మూవీస్ ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? ఎలాంటి కథతో వస్తున్నాయి? ఎక్కడ స్ట్రీమ్ అవ్వనున్నాయి? అనేది చూసేద్దాం. 

థియేటర్ సినిమాలు:

మాస్ జాతర:

రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శుక్రవారం అక్టోబర్ 31న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌‌‌‌ గమనిస్తే.. కంప్లీట్  మాస్ ఎలిమెంట్స్‌‌తో పాటు ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేసేలా ఉన్నాయి. సాంగ్స్ కూడా మంచి మాస్ మసాలా అందించేలా ఉన్నాయి. రవితేజ మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టెప్పులు, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ కు ఫుల్ మాస్ విందే అని చెప్పుకోవాలి. 

'బాహుబలి: ది ఎపిక్'

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ రిలీజై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ రెండు భాగాలను కొత్తగా ఎడిట్ చేసి, సాంకేతికంగా మెరుగుపరచిన ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. భారతదేశంలో అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది.

అయితే, అమెరికా మార్కెట్‌లో మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రెండు రోజుల ముందే, అక్టోబర్ 29నే ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఇపుడు ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్ సుమారు 3 గంటలా 44 నిమిషాల నిడివితో ఆడియన్స్ ను అలరించనుంది. మరి ఎలాంటి కట్స్ తో రానుందో తెలియాల్సి ఉంది. 

3) ఆర్యన్:

విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ రూపొందించిన చిత్రం ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. శుక్రవారం అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. క్రైమ్ అండ్ థ్రిల్లర్ జానర్లో మూవీ తెరకెక్కింది. ఇటీవలే ఆర్యన్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఓ హత్య దర్యాప్తుతో విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ సాగిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తీసుకెళ్లేలా ఉన్నాయి. ఓ సైకో తాను ఎవరిని హత్య చేయబోతున్నాడో గంట ముందు అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మరీ మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఆ గంటలోపు అతన్ని పట్టుకోగలగాలి. ఇలాంటి క్రైమ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఆర్యన్.. ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి!!

4) కర్మణ్యే వాధికారస్తే :

శత్రు, బ్రహ్మాజీ, మహేంద్రన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘కర్మణ్యే వాధికారస్తే’. అంటే "మీకు పని చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై కాదు" అని అర్థం. ఇది భగవద్గీతలోని రెండవ అధ్యాయం, 47వ శ్లోకం. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ దర్శకుడు. ప్రస్తుత నేర ప్రపంచంలో జరుగుతున్న నిజజీవిత ఘటనల ఆధారంగా మూవీ రూపొందింది. అక్టోబరు 31న థియేటర్లలోకి రానుంది. 

5. ‘ది తాజ్‌ స్టోరీ’:

బాలీవుడ్ సీనియర్ నటుడు పరేశ్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘ది తాజ్‌ స్టోరీ’. తుషార్ అమ్రిష్ గోయల్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వెనుక దాగి ఉన్న రహస్యాలను చూపించబోతుంది. ఈ నెల 31న థియేటర్లలో మూవీ విడుదల కానుంది. 

ఓటీటీ సినిమాలు:

నెట్‌ఫ్లిక్స్:

ది అసెట్- (డానిష్ క్రైమ్, థ్రిల్లర్)- అక్టోబర్ 27

‘ఇడ్లీ కొట్టు’ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ డ్రామా)- అక్టోబర్ 29 

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్)- అక్టోబర్ 29 

అలీన్ : అక్టోబర్ 30 నుండి స్ట్రీమింగ్. 

ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

OG (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్)- అక్టోబర్ 23

కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ యానిమేషన్)- అక్టోబర్ 24

ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్)- అక్టోబర్ 24 

జియోహాట్‌స్టార్‌: 

‘లోక చాప్టర్‌ 1: చంద్ర’ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ హీరో ఫాంటసీ)- అక్టోబర్ 31

మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ వెబ్ సిరీస్) - అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ 

అమెజాన్‌ ప్రైమ్‌:

హెడ్డా (అమెరికన్ డ్రామా రొమాన్స్)- అక్టోబరు 29

హెజ్బిన్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌)- అక్టోబరు 29 

కాంతార: చాప్టర్‌ 1( తెలుగు డబ్బింగ్ కన్నడ మైథలాజికల్)- అక్టోబర్ 31

జీ5:

మారిగల్లు (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

సన్ నెక్స్ట్ :

బ్లాక్ మెయిల్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)- అక్టోబర్ 30