
ఓటీపీని ఎవరికీ చెప్పొద్దు. ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్, ఇ–మెయిల్స్ ద్వారా ఓటీపీని షేర్ చేయడం ద్వారా చాలామంది మోసపోతున్నారు. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అది నమ్మి, ఓటీపీ వివరాలు చెప్తే మోసపోతారు.
- ఓటీపీలు సాధారణంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి వస్తాయి. కాబట్టి, ఫోన్లో లాక్ స్క్రీన్ పిన్ లేదా పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌ని ఇతరులకు ఇవ్వద్దు. యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు లేదా యాప్ పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి.
- సిమ్ కార్డ్ లాక్ లేదా సిమ్ కార్డ్ స్వాప్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్‌లు మొబైల్ నెంబర్‌కు అన్ అఫీషియల్ యాక్సెస్‌ను కంట్రోల్ చేయడంలో సాయపడతాయి.
- చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మెసేజ్ లేదా ఇ–మెయిల్ ద్వారా ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్స్ పంపిస్తాయి. ఏదైనా స్పామ్ అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్‌కి వెళ్లాలి లేదా ఫోన్ చేయాలి.
- మాల్వేర్, అన్ అఫీషియల్ యాక్సెస్ నుంచి మొబైల్, కంప్యూటర్ డివైజ్‌లను సేఫ్‌గా ఉంచుకోవాలి. ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్స్ భద్రంగా ఉంచాలి. ఆయా యాప్స్ లేదా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఏ మాత్రం అనుమానం వచ్చినా డౌన్‌లోడ్ చేయడం ఆపేయాలి.
- బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఏవైనా తేడాలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే బ్యాంక్‌లో రిపోర్ట్ చేయాలి.
- సాధారణ స్కామ్‌ల గురించి అవగాహన ఉండాలి. స్కామ్‌లు, మోసం చేసే టెక్నిక్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీల నుంచి వచ్చే తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి.
- మీ మాతృభాషలో మాట్లాడమని కస్టమర్‌కేర్ కాలర్‌ను అడగాలి. లేదా బ్రాంచ్‌కి వెళ్తామని చెప్పాలి. నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రశ్నించాలి.