Men Special : నవంబర్ నెలలో ఎవరూ గెడ్డం గీయరా.. అలాగే పెంచుతారా..!

Men Special : నవంబర్ నెలలో ఎవరూ గెడ్డం గీయరా.. అలాగే పెంచుతారా..!

నవంబర్ నెల మొదలైందంటే చాలు చాలామంది అబ్బాయిలు గెడ్డం, మీసాలు గీసుకోవడం మానేస్తారు. ఈ నెలంతా ట్రిమ్మర్, రేజర్ ముట్టుకోరు. ఇదంతా నో షేప్ నవంబర్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వెనక కారణం... ప్రొస్టేట్, టెస్టిక్యులర్ క్యాన్సర్ల మీద అవేర్ నెస్ పెంచడం. ఆ క్యాన్సర్లని తగ్గించడం, ఈ క్యాన్సర్ల బారిన పడిన రోగుల్ని కాపాడడం. 

ఆ నెలంతా గెడ్డం గీసుకోకుండా మిగిల్చిన మొత్తాన్ని క్యాన్సర్ పేషెంట్లకి ఇస్తారు. ఈ ఛాలెంజ్ తీసుకున్నవాళ్లు గెడ్డం స్టయిల్ గా, నీట్ గా పెరగడానికి ఏం చేయాలంటే...

  • గెడ్డం స్టయిల్, పెద్దగా రావాలంటే రెగ్యులర్ బియర్డ్ ఆయిల్ రాసుకోవాలి. 
  • విటమిన్లు, అలోవెరా ఉన్న ఆయిల్ వాడితే కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూ, గడ్డం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే కండీషనర్ మర్చిపోవద్దు. 
  • గెడ్డాన్ని రోజూ దువ్వుకోవాలి. అందుకోసం గుండ్రని, మెత్తని పళ్లు ఉన్న దువ్వెన వాడాలి. దీంతో గడ్డం అంతటా ఒకేలా, నీట్ గా పెరుగుతుంది. అంతేకాదు గెడ్డాన్ని ఆరబెట్టేందుకు కూడా ఈ దువ్వెన పనికొస్తుంది.
  • అనుకున్న స్టయిల్ లో గెడ్డం పెరగాలంటే క్వాలిటీ బియర్డ్ క్రీమ్ రాసుకోవడం తప్పనిసరి. 
  • బియర్డ్ బామ్ వాడినా లుక్ బాగుంటుంది. అయితే పెట్రోలియం జెల్లీ వంటివి ఉన్న బియర్డ్ బామ్ వాడొద్దు. 
  • మీడియం హీట్ చేసిన బ్లో డ్రైయర్ తో గెడ్డాన్ని నచ్చిన ఆకారంలో స్టయిల్ గా చేసుకోవచ్చు. అయితే బ్లో డ్రైయర్ వాడేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే డ్రైయర్ హీట్ ఎక్కువ అయితే గెడ్డం లుక్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉంది. 
  • పోషకాలున్న ఫుడ్ తింటే గెడ్డం కూడా బాగా పెరుగుతుంది. అందుకు విటమిన్లు ఎక్కువగా ఉన్నఫుడ్ తినాలి.