నిద్రకు ముందు ఇలాంటి ఆలోచనలొద్దు

నిద్రకు ముందు ఇలాంటి ఆలోచనలొద్దు

కొంతమంది పండుకోగానే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటే, ఇంకొంతమంది చాలాసేపటికి గానీ నిద్రపోలేరు. కారణం పండుకోగానే రకరకాల ఆలోచనలు. గతం గురించి, భవిష్యత్‌‌ గురించి.. కొన్ని పనులు అనవసరంగా చేశామని, ఇంకొన్ని చేయలేకపోయామని.. ఇలా అనేక విషయాలు గుర్తొచ్చి వాటిగురించే ఆలోచిస్తూ నిద్రపోరు. మంచి నిద్ర కావాలంటే ఇలాంటి ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. 

  • బెడ్‌‌పై పడుకున్న తర్వాత ల్యాప్‌‌టాప్‌‌, స్మార్ట్‌‌ఫోన్‌‌, ట్యాబ్లెట్‌‌ వంటి గాడ్జెట్స్‌‌ దూరంగా పెట్టాలి. వీటిని వాడటం వల్ల స్ట్రెస్‌‌, యాంగ్జైటీ పెరిగి, అనవసరపు ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలతో మెదడుపై పనిభారం పెరిగి, మెలటోనిన్‌‌ పెరుగుతుంది. దీంతో నిద్రపట్టేందుకు చాలా టైం పడుతుంది.
  • గతం గురించి, భవిష్యత్‌‌ గురించి ఆలోచించకూడదని మనసుకు గట్టిగా చెప్పాలి. ‘గతాన్ని మార్చలేం.. భవిష్యత్‌‌ను ఊహించలేం’ అని తెలుసుకోవాలి. వర్తమానంలో ఉండేందుకు ప్రయత్నించాలి. ఏ టైంలో అయినా, అప్పటి విషయాల గురించే ఆలోచిస్తే సమస్య ఉండదు. ఇలా ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటే బ్రెయిన్‌‌ రిలాక్స్‌‌డ్​గా ఉంటుంది.
  • ఎక్కువసేపు నిద్రపట్టకుంటే, రిలాక్సింగ్‌‌ యాక్టివిటీస్‌‌ ట్రై చేయొచ్చు. బుక్స్‌‌ చదవడం, మ్యూజిక్‌‌ వినడం, డ్రాయింగ్‌‌ వంటి హాబీస్‌‌ బ్రెయిన్​ను రిలాక్స్‌‌ చేస్తాయి.
  • అనవసరపు ఆలోచనలు రాకుండా కంట్రోల్‌‌ చేసుకోలేకపోతే, దీనికి రోజులో ఒక టైం పెట్టుకోవాలి. పడుకునే ముందు లేదా సాయంత్రం అవసరమైన విషయాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఆ విషయాల మీద ఒక అభిప్రాయానికి వచ్చి, ఆ తరువాత ఆలోచనల్ని వదిలేయాలి. దీన్ని వర్రీయింగ్‌‌ టైం అంటారు. 15–30 నిమిషాల వరకు దీనికి కేటాయించాలి. ఈ టైంలో మనసుకు ఒత్తిడి కలిగించే అంశాల్ని రాసుకుని, వాటికి పరిష్కారం కనుక్కుని రిలాక్స్ అవ్వాలి.
  • అరోమాథెరపీలో వాడే లావెండర్‌‌‌‌ ఎసెన్షియల్‌‌ ఆయిల్స్ వాడాలి. ఇవి స్ట్రెస్‌‌ తగ్గించి, రిలాక్సేషన్‌‌ ఇస్తాయి. సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఈ ఆయిల్‌‌ వాడొచ్చు. ఒక టవల్‌‌ లేదా క్లాత్‌‌పై కొన్ని చుక్కలు చిలకరించుకోవచ్చు. కొన్ని ఆయిల్స్‌‌ అలర్జీ కలిగించవచ్చు. కాబట్టి, వీటిని చూసుకుని వాడాలి. 
  • మజిల్‌‌ రిలాక్సేషన్​కి మరో మంచి టెక్నిక్‌‌ ఉంది. బెడ్‌‌పై పడుకుని, ఒంటిపై కాళ్లు, చేతులు, మెడకు సంబంధించి కండరాల్ని మృదువుగా నొక్కితే రిలాక్స్‌‌ అవుతాయి. దీనివల్ల మంచి నిద్రపడుతుంది.