
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, సక్సెస్ స్టోరీలు ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు. చాలామందికి సాయం కూడా చేశారాయన. ఇప్పుడు తన ట్వీట్‌తో ‘డబ్బులు వేస్ట్ చేయొద్దు’ అంటూ హితబోధ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. అదేంటంటే.. మన దేశానికి చెందిన ఒకాయన అమెరికాలో తన సొంతకారులో షికారు చేస్తున్న వీడియో. కారులో షికారు చేస్తే వింతేముంది? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది మామూలు కారు కాదు బంగారం తొడుగుతో ఉన్న ఫెరారీ. ఆ కారులో ఇద్దరు కూర్చొని షికారు చేస్తుంటే జనమంతా వింతగా చూస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దాన్నే ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ‘మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన వేస్ట్ ఖర్చు ఎలా చేయకూడదు? అనేది ఈ వీడియో ద్వారా పాఠం నేర్చుకోవాలి. అసలు ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అర్థం కావడం లేదు” అంటూ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ కూడా సెటైర్లు పేలుస్తున్నారు. “ మన ఇండియన్స్‌కు బంగారం అంటే మక్కువ ఎక్కువ. అందుకే, అలా బంగారుపూతతో కారు కొన్నారు. కానీ, ఎక్కడ గీతలు పడతాయో అని దాన్ని గ్యారేజ్‌లోనే ఉంచేస్తారు” అని ట్వీట్లు చేస్తున్నారు.