నలభైల్లో ఇరవైల్లా ఉండాలంటే ఇలా చేయండి

నలభైల్లో ఇరవైల్లా ఉండాలంటే ఇలా చేయండి

వయసు పెరుగుతున్నా  అందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు కొందరు మగవాళ్లు. అందుకు ఫుడ్​ హ్యాబిట్స్​, జీన్స్ కారణం అనేది తెలిసిందే. అయితే జుట్టు, చర్మం అందంగా కనిపించాలనే తొందరలో కొన్ని పొరపాట్లు  చేస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే వాటివల్ల నష్టపోకుండా ఉండొచ్చు...

  • తల స్నానానికి హట్​ వాటర్​ వాడితే వెంట్రుకలు దెబ్బతింటాయి. చుండ్రు వచ్చి వెంట్రుకలు రాలిపోతాయి. ఈ సమస్య రాకుండా ఖరీదైన షాంపూ, కండీషనర్​ వాడక్కరలేదు.  కొద్దిగా యాపిల్​ సిడార్​ వెనిగర్​ను వేడినీళ్లలో వేయాలి. ఆ నీళ్లతో తలస్నానం చేయాలి.  సల్ఫేట్​ లేని షాంపూ కూడా వాడొచ్చు. నల్లా, షవర్​లకు  ప్యూరిఫైయింగ్​ ఫిల్టర్స్​ బిగిస్తే బెటర్​. 
  • జీర్ణాశయంలో ఉండే ప్రొబ్యాక్టీరియా మన చర్మం తీరును ప్రభావితం చేస్తుంది. అందుకే పెరుగు​ తినాలి. లేదా ప్రొబయాటిక్స్​ను సప్లిమెంట్స్​ రూపంలో తీసుకున్నా పర్లేదు. 
  • రాత్రి నిద్రపోయే ముందు పాదాలు, కాలి మడమలకు ఆముదం నూనెతో మసాజ్​ చేసుకోవాలి. తరువాత పాదాలను ఉప్పు కలిపిన  వేడి నీళ్లలో కాసేపు ఉంచాలి.
  • పళ్లు మెరవాలన్నా, నోటి దుర్వాసన, పంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ డెంటిస్ట్​లను కలవాలి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్రష్​ చేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి.
  • నోటి దుర్వాసన రాకుండా పైనాపిల్​ ముక్కలు నమలాలి. వెనిగర్​ ఉన్న మౌత్​వాష్​, ప్రొబయాటిక్స్​, విటమిన్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– సి ఉన్న పండ్లు, ఆహారం  తినాలి.