నేటి డిజిటల్ యుగంలో నిద్రలేచిన వెంటనే మన ఫోన్లను చెక్ చేయడం చాలా మందికి ఇదొక అలవాటుగా ఉంటుంది. అలారం ఆఫ్ చేయడం.. సోషల్ మీడియాలో నోటిఫికేషన్లు చూడటం వంటివి చేస్తుంటా.. ఇలాంటివి రోజు దినచర్యలో ఓ భాగమై పోతున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఈ అలవాటు వల్ల కలిగే హాని గురించి ఆలోచించారా? మన నిత్య జీవితంలో స్క్రీన్‌ల వినియోగం పెరుగుతున్నందున అవి మన ఆరోగ్యంపై చూపే హానికరమైన ప్రభావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఉదయాన్నే మీ ఫోన్ చెక్ చెకింగ్.. హానికరమైన ప్రభావాలు:
నిద్రలేచిన వెంటనే ఫోన్లను చెక్ చేయడం వల్ల ఎక్కవ ప్రభావం మన మానసిక స్థితిపై చూపుతుంది. మన కళ్లు తెరిచిన వెంటనే ఫోన్లలో ఈమెయిల్స్, మేసేజ్ లు, సోషల్ మీడియా అప్డేట్లు చూస్తుంటాం. దీంతో మనం రోజును ప్రారంభించకముందే ఎక్కు స్ట్రెస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సెల్ ఫోన్ల స్క్రీన్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి కిరణాలు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయట. స్క్రీన్ నుంచి వచ్చే కృత్రిమ నీలికాంతి నిద్రమేల్కోనే చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
Also Read : స్త్రీ రూపంలో ఎక్కడ పూజలు అందుకుంటున్నాడో తెలుసా
పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్లకు స్క్రీన్లకు అతుక్కపోవడం వల్ల మనలో ఎక్కువ పరధ్యానం, వాయిదాల వేసే తత్వం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. కొత్త సమాచారం చూసేందుకు మనం ఇష్టపడతాం కాబట్టి.. రోజువారీ పనులకు బ్రేక్ వేసే అవకాశం ఉంది.
ఉదయం పూట ఫోన్ చూడటం వల్ల మిగతా రోజును మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తోంది..అటోమేటిక్ గా మనం చేసే పనులపై ప్రభావం పడుతుంది.సోషల్ మీడియా ప్రతికూలత ప్రభావంతో ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. రోజంతా అదే ఎమోషన్ తో ఉండేలా చేస్తుంది. ఇది మన మానిసిక స్థితి, శక్తిపై ప్రభావం చూపుతుంది.
కాబట్టి ఈ హానికరమైన అలవాటును మానుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోషల్ మీడియాను చెక్ చేసుకునేందుకు ఓ నిర్ధిష్ట సమయాలన్ని సెట్ చేసుకోవాలి అంటున్నారు. నిద్ర లేవగానే చదవడం గానీ, వ్యాయామం చేయడంతో మన రోజువారీ కార్యక్రమాలను మొదలు పెట్టడం నేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.