OMG : గూగుల్ సీఈవో ఒక రోజు జీతం.. రూ.5 కోట్లు..

OMG : గూగుల్ సీఈవో ఒక రోజు జీతం.. రూ.5 కోట్లు..

సుందర్ పిచాయ్ ..గూగుల్, ఆల్ఫాబెట్  సీఈవో.. దాదాపు గూగుల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుందర్ పిచాయ్ తెలుసు.  గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ జీతం ఎంతుంటుందని భావిస్తున్నారు.. అక్షరాల ఆయన జీతం సంవత్సరానికి 1,663 కోట్లు. అంటే నెలవారీ జీతం దాదాపు రూ. 150 కోట్ల పారితోషికం అందుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన రోజుకు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు సుందర్ పిచాయ్.

రోజుకు రూ. 5 కోట్లు సంపాదిస్తున్న సుందర్ పిచాయ్ లాంటి గొప్ప వ్యక్తి  చిన్న తనంలో ఏం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడో తెలుసా.. క్రికెటర్ గా కావాలనుకు న్నాడట. చెన్నైలోని తాను చదువుకున్న పాఠశాల క్రికెట్ జట్టుకు కెప్టెన్ న్ కూడా చేశాడట. జట్టు కోసం చాలా టోర్నమెంట్ లు గెలుచుకున్నాడు. అయితే సుందర్ పిచాయ్ కి టీ20 ఫార్మాట్ అంటే అస్సలు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన సుందర్ పిచాయ్.. పై చదువుల కోసం స్టోన్ ఫోర్డ్ యూనివర్సిటీ , వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియాకు వెళ్లాడు. 2004లో గూగుల్ ఉద్యోగం చేరాడు. కంపెనీలో వివిధ పోస్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారుర. అనేక ఆవిష్కరణలకు నాయకత్వం వహించాడు. అక్టోబర్ 2015లో Google  CEO  గా నియమితులయ్యారు. 2017లో పిచాయ్ ఆల్ఫాబెట్స్ డైరెక్టర్ కూడా అయ్యారు. 

ప్రపంచ వ్యాప్తంగా టెకీలు గూగుల్ లో ఉద్యోగం కోసం కలలు కంటుంటారు. భారీ మొత్తం లో జీతం, అద్భతమైన వర్కింగ్ స్టైల్, పని ఒత్తిడిలేని వాతావరణం ఇవన్నీ ఉద్యోగులకు కంపెనీ అందిస్తోంది.పంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఆఫీసుల్లో మౌలిక సదుపాయాలు సూపర్ గా ఉంటాయి.  అలాంటి సంస్థకు సీఈవో మరీ ఆ మాత్రం పారితోషికం ఉండకపోతే ఎలా.. సుందర్ పిచాయ్ మన ఇండియన్ అయినందుకు గర్వపడదాం..