Good Health : సమయానికి నిద్రపోతే ఎంత ఆరోగ్యమో తెలుసా..

Good Health : సమయానికి నిద్రపోతే ఎంత ఆరోగ్యమో తెలుసా..

పార్టీలు, ఓవర్ నైట్ వర్క్ షిప్ట్ లే కాకుండా ఈ మధ్య వచ్చిన బింజ్ వాజ్(టీవీలు గంటల తరబడి చూడడం) ట్రెండ్ వల్ల చాలామంది నిద్ర పోయే ట్రైం (స్లీప్ సైకిల్) తగ్గిపోతుంది. ఇవే కాకుండా పని ఒత్తిడి కూడా సరైన నిద్ర లేకపోవడానికి కారణం అవుతోంది. రాత్రి నిద్రతోనే ఆరోగ్యం సొంతం అవుతుంది. సరైన టైంకి నిద్రపోవడంవల్ల చాలా రకాల లాభాలున్నాయి. 

* రాత్రి నిద్ర రోజులో శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది.

* ఉదయం ప్రెష్ గా ఉంటారు. బద్ధకం ఉండదు. 

* ఆరోగ్యంగా ఉంటారు. చురుకుగాపని చేసుకోగలుగుతారు.

* ఊబకాయం బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

* నిద్ర సరిపోకపోతే చికాకు, కోపం పెరిగే అవకాశం ఉంటుంది.

* మానసిక ఒత్తిడికి గురిచేసే ప్రమాదం కూడా ఉంటుంది. 

* మంచి నిద్ర డయాబెటిస్, గుండె సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

* ఇమ్యూనిటీ పెరగడానికి కూడా మంచి నిద్ర సాయ పడుతుంది.