ఇస్రో సైంటిస్టుల జీతాలు.. ఐటీ ఉద్యోగుల కంటే తక్కువని తెలుసా..!

ఇస్రో సైంటిస్టుల జీతాలు.. ఐటీ ఉద్యోగుల కంటే తక్కువని తెలుసా..!

చంద్రయాన్ 3 సక్సెస్ చేశారు.. చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన కీర్తి ప్రతిష్టలు వారి సొంతం.. అంతేనా ఇస్రో అంటే విజయానికి మారుపేరు.. రాకెట్ల ప్రయోగంతో వేలాది శాటిలైట్లను అంతరిక్షం ప్రవేశపెడుతుంది. నాసా కూడా సాధ్యం కానిది చేసి చూపించిన ఇస్రో శాస్త్రవేత్తలు అంటే అందరూ శెభాష్ అంటూ కీర్తిస్తున్నారు. మరి వారి జీతాలు ఎలా ఉంటాయి.. ఎంత ఉంటాయి.. ఇంత టాలెండెట్ మనుషులకు లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయా అనే ప్రశ్న రావటం సహజం. 

వాస్తవం ఏంటో తెలుసా.. ఐటీ ఉద్యోగుల కంటే ఇస్రో శాస్త్రవేత్తల జీతాలు తక్కువ అని.. అవును.. కేంద్ర ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులుగానే వాళ్లని పరిగణిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మార్కెట్ లో టాప్ ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల జీతాల కంటే.. ఇస్త్రో సైంటిస్టుల జీతాలు తక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇతర అలెవెన్సుల రూపంలో మరికొంత అందుకుంటారు అంతే.. 

ఏ కేటగిరీ సైంటిస్ట్ కు.. ఎంతెంత జీతమో చూద్దాం..

 

  • ఇంజనీర్/సైంటిస్ట్ - SD     రూ.15,600-రూ.39,100
  • ఇంజనీర్/సైంటిస్ట్ - SE       రూ.15,600-రూ.39,100
  •  ఇంజనీర్/సైంటిస్ట్ - SF    రూ. 37,400-రూ.67,000
  •  ఇంజనీర్/సైంటిస్ట్ - SG    రూ.37,400-రూ.67,000
  • ఇంజనీర్/సైంటిస్ట్ - హెచ్    రూ.37,400-రూ.67,000
  • Best Scientist     రూ.67,000-రూ.79,000
  • Eminent Scientist                 రూ.75,500-రూ.80,000

ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు వారి బేసిక్ వేతనంతో పాటు ప్రోత్సాహకాలు, స్టైపెండ్‌లు ఇస్తారు. కొన్ని అలవెన్సులు నెలవారీగా చెల్లిస్తారు. ఇస్రో ప్రతి సంవత్సరం క్వాలిఫైడ్ ఇంజనీర్లను రిక్రూట్ చేస్తుంది. అర్హతగల అభ్యర్థులు  అప్లై చేసుకుని ఇస్రోలో చేరవచ్చు.

1962లో ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ (INCOSPAR) స్థాపించబడింది. 1969లో దీనిని ISRO (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ)గా మార్చారు.   ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు బేసిక్ జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పలు ప్రయోజనాలను అందిస్తుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది.  ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో స్థాపించబడింది.