సెల్‌‌ఫోన్లలో ఉన్న సెన్సర్ల గురించి తెలుసా?

V6 Velugu Posted on Sep 06, 2021

ఒకప్పుడు ఫోన్‌‌ అంటే మాట్లాడుకోనికే. కానీ, ఇప్పుడు స్మార్ట్‌‌ఫోన్లు వచ్చినంక అట్ల కాదు. మాటలు దాటి.. పాటల వినుడు నుంచి సినిమాలు చూసుడు వరకు ఫోన్‌‌లనే. మెసేజ్‌‌ల నుంచి జీవితంల జరిగే ప్రతిదాన్ని దాంట్లో దాచిపెడతది ఫోన్‌‌. కొత్తచోటికి పోవాల్నన్నా.. కొత్తోళ్లు మన ఇంటికి రావాల్నన్నా దారి చూపిస్తది. మనం రోజు ఎంత దూరం పోతున్నం? మన గుండె ఎట్ల కొట్టుకుంటది? లాంటివి కూడా చెప్తది. ఇవన్నీ జరగాలంటే ఫోన్లల్ల సెన్సర్లు ఉండాలి. మరి ఏ సెన్సర్‌‌‌‌ ఎట్ల పనిజేస్తది? ఏ సెన్సర్‌‌‌‌ ఏం పనిచేస్తదంటే?

ప్రాక్సిమిటీ సెన్సర్‌‌‌‌
ఫోన్‌‌కి దగ్గర్లో ఉన్న వస్తువులను ఈ సెన్సర్‌‌‌‌ డిటెక్ట్‌‌ చేస్తుంది. అంతేకాకుండా ఫోన్‌‌ మాట్లాడేటప్పుడు స్క్రీన్‌‌ ఆగిపోవడానికి ప్రాక్సిమిటీ సెన్సర్‌‌ కారణం. ఇది ఉండటం వల్ల చేతులు టచ్​ అయ్యి ఫోన్‌‌ ఆగిపోవడం లాంటివి జరగవు. అంతేకాకుండా బ్యాటరీ లైఫ్‌‌ను కూడా కాపాడుతుంది.

యాక్సిలెరోమీటర్‌‌‌‌
సెల్‌‌ఫోన్‌‌ ఓరియెంటేషన్‌‌ను డిసైడ్‌‌ చేస్తుంది యాక్సిలెరోమీటర్‌‌‌‌ సెన్సర్‌‌‌‌. అంటే మనం ఫోన్‌‌ ఎటువైపు తిప్పితే అలా కంటెంట్‌‌ను అడ్జస్ట్‌‌ చేస్తుంది. డివైజ్‌‌ పోట్రైట్‌‌లో ఉందా ల్యాండ్‌‌స్కేప్‌‌లో ఉందా అనే దాన్ని రీడ్‌‌చేసి సెట్‌‌ చేస్తుంది. అలానే యూట్యూబ్‌‌ వీడియోలు చూసేటప్పుడు మనం ఫోన్‌‌ను ఎటు తిప్పితే ఆ స్క్రీన్‌‌కు తగ్గట్లుగా అడ్జెస్ట్ చేస్తుంది.

గైరోస్కోప్‌‌
ఫోన్‌‌లోని డైమన్షన్స్‌‌, మూమెంట్స్‌‌ను, ఎడిషనల్‌‌ డైమన్షన్స్‌‌ కావాల్సినప్పుడు ఈ సెన్సర్‌‌‌‌ పనిచేస్తుంది. ఇది యాక్సిలెరోమీటర్‌‌తో కలిసి పనిచేస్తుంది. 360 డిగ్రీల్లో ఫొటో తీసేటప్పుడు, మోషనల్‌‌ గేమ్స్‌‌, రేసింగ్‌‌ గేమ్స్‌‌ ఆడేటప్పుడు ఫోన్‌‌ను అటూ ఇటూ తిప్పితే ఆబ్జెక్ట్‌‌ కదిలేందుకు గైరోస్కోప్ సెన్సర్‌‌ కారణం‌‌.

బయోమెట్రిక్స్‌‌
ఫోన్‌‌కు లాక్‌‌ వేసేందుకు, డేటా ఇంకొకరు చూడకుండా ఉండేందుకు మనం వాడే ఫింగర్‌‌‌‌ ప్రింట్‌‌ లాక్‌‌, ఫేస్‌‌లాక్‌‌, ఐఆర్‌‌‌‌ఐఎస్‌‌ లాంటివన్నీ బయోమెట్రిక్‌‌ సెన్సర్‌‌‌‌ ద్వారా పనిచేస్తాయి. వాటితో పాటు ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌, హార్ట్‌‌రేట్‌‌ లాంటివి రికార్డు చేసేందుకు కూడా ఈ సెన్సర్‌‌‌‌ ఉపయోగపడుతుంది.

ఎన్‌‌ఎఫ్‌‌సీ
నియర్‌‌‌‌ ఫీల్డ్‌‌ కమ్యూనికేషన్‌‌ని... ఎన్‌‌ఎఫ్‌‌సీ సెన్సర్‌‌‌‌గా చెప్తారు. పది సెంటీమీటర్ల దూరంలో ఉన్న మరో డివైజ్‌‌తో కమ్యూనికేట్‌‌ అయ్యేందుకు ఈ  సెన్సర్‌‌‌‌ ఉపయోగపడుతుంది. డేటా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసేందుకు, గూగుల్‌‌పే, ఫోన్‌‌పే లాంటి యాప్స్‌‌ నుంచి డబ్బులు ట్రాన్స్​ఫర్‌‌‌‌ చేసేటప్పుడు ఇది అవసరం. బ్లూటూత్‌‌ నుంచి డేటా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసేకంటే.. ఎన్‌‌ఎఫ్‌‌సీ ద్వారా చేయడం సేఫ్‌‌.

యాంబియంట్‌‌ లైట్‌‌ సెన్సర్‌‌‌‌
ఫొటో తీసేటప్పుడు లైట్‌‌ ఇంటెన్సిటీని ఈ సెన్సర్‌‌‌‌ చెక్‌‌ చేసి, దానికి తగ్గట్లుగా లైట్‌‌ను అడ్జస్ట్‌‌ చేస్తుంది. దాంతోపాటుగా స్క్రీన్‌‌ బ్రైట్‌‌నెస్‌‌ను కూడా సరిచూస్తుంది. కార్లలోని ఆటో డిమ్మింగ్‌‌ అద్దాల్లో కూడా ఈ సెన్సర్‌‌‌‌నే వాడతారు.

ఐఆర్‌‌‌‌ బ్లాస్టర్‌‌‌‌ 
రిమోట్‌‌తో పనిలేకుండా ఫోన్‌‌తోనే టీవీ, ఏసీ లాంటివి ఆపరేట్‌‌ చేసేందుకు ఐఆర్‌‌‌‌ బ్లాస్టర్‌‌ అవసరం‌‌. మ్యాప్స్‌‌లో దారి చూపించేందుకు, దిక్కుల గురించి తెలుసుకునేందుకు డిజిటల్‌‌ కంపాస్‌‌, జీపీఎస్‌‌ సెన్సర్లు ఉపయోగ పడతాయి. జీపీఎస్‌‌ ద్వారా ఉన్న లొకేషన్‌‌, వెళ్లాల్సిన లొకేషన్‌‌ గురించి తెలుసు కోవచ్చు. ఇవి ఇన్‌‌పుట్‌‌ శాటిలైట్స్‌‌ ద్వారా పనిచేస్తాయి. ఇవి రెండూ స్మార్ట్‌‌ఫోన్‌‌ డేటా మీద ఆధారపడి పనిచేయవు. అందుకే, ఆఫ్‌‌లైన్‌‌లో ఉన్నాకూడా పనిచేస్తాయి. ఫోన్‌‌లో లొకేషన్స్‌‌ను త్వరగా కనిపెట్టేందుకు జీపీఎస్‌‌కు బారోమీటర్‌‌‌‌ సెన్సర్‌‌‌‌ హెల్ప్‌‌ చేస్తుంది. దాంతోపాటు వాతావరణం గురించి చెబుతుంది. ఎంత దూరం నడిచాం, ఎన్ని కేలరీలు బర్న్‌‌ అయ్యాయి అని చెప్పేందుకు పీడోమీటర్‌‌‌‌ సెన్సర్‌‌‌‌ ఉపయోగ పడుతుంది. ఫోన్‌లో ఉన్న సెన్సర్స్‌ గురించి తెలుసుకునేందుకు కొన్ని యాప్స్‌ కూడా ఉంటాయి. వాటిని గూగుల్‌ ప్లే స్టోర్‌‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tagged cell phones, , sensors

Latest Videos

Subscribe Now

More News