ఎండాకాలంలో ఏ మాస్క్‌ వాడితే బెటర్‌?

ఎండాకాలంలో ఏ మాస్క్‌ వాడితే బెటర్‌?


ప్రస్తుతం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లినా కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాల్సిందే. అయితే సమ్మర్‌‌లో ఎక్కువసేపు మాస్క్‌ పెట్టుకోవడం కష్టమైన పని. వేడి, చెమట వల్ల మాస్క్‌ పెట్టుకుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అలాగని మాస్క్‌ తీస్తే, ఇంకా డేంజర్‌‌. అందుకే ఈ సీజన్‌లో మాస్క్‌ పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల ఈ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు.

ఫ్యాబ్రిక్‌‌

సమ్మర్‌‌‌‌లో కొన్ని ఫ్యాబ్రిక్స్‌‌ వాడకూడదు. ముఖ్యంగా పాలిస్టర్‌‌‌‌ మాస్క్‌‌లకు దూరంగా ఉండాలి. ఇవి వేడిని త్వరగా గుంజుకుంటాయి. దీంతో ఈ మాస్క్‌‌ పెట్టుకుంటే, వేడి ప్రభావంతో త్వరగా అలసిపోయినట్లు అవుతారు. అందువల్ల కాటన్‌‌తో తయారైన మాస్క్‌‌లే వాడాలి. అలాగే, కనీసం రెండు లేదా మూడు లేయర్స్‌‌ ఉండేలా చూసుకోవాలి. కాటన్‌‌ మాస్క్‌‌లు చల్లదనాన్ని ఇస్తాయి. చర్మంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. బ్రీతింగ్‌‌ కూడా బాగుంటుంది.

కలర్‌‌‌‌

ఈ సీజన్‌‌లో ఏ కలర్‌‌‌‌ మాస్క్‌‌ వాడుతున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్‌‌. ఎందుకంటే బ్లాక్, నేవీ బ్లూ వంటి కొన్ని కలర్స్‌‌ వేడిని త్వరగా గుంజుకుంటాయి. అందువల్ల డార్క్‌‌ కలర్స్‌‌, బ్లాక్‌‌, బ్లూ వంటి కలర్స్‌‌ మాస్క్‌‌లు వాడొద్దు. లైట్‌‌ కలర్స్‌‌ అయిన వైట్‌‌, బ్రౌన్‌‌, క్రీమ్‌‌ కలర్‌‌‌‌ మాస్క్‌‌లు అయితే చాలా మంచివి. ఇవి ఎండవేడి ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తాయి. ఎక్కువసేపు ఈ కలర్‌‌‌‌ మాస్క్‌‌లు పెట్టుకున్నా, పెద్దగా ఇబ్బంది అనిపించదు.

రెండు మాస్క్‌‌లు ఉండాల్సిందే..

పైన చెప్పుకొన్నట్లు కాటన్‌‌ అండ్‌‌ లైట్‌‌ కలర్‌‌‌‌ మాస్క్‌‌లు పెట్టుకున్నా, చెమట రాకుండా ఉండదు. మిగతా మాస్క్‌‌లతో పోలిస్తే, ఇవి చాలా బెటర్‌‌‌‌ అయినా, ఎండ, చెమటను పూర్తిగా తట్టుకోలేవు. ఐదు గంటల తర్వాత ఏ మాస్క్‌‌ అయినా చెమటకు తడిసిపోతుంది. కాబట్టి, ఎక్కువ సేపు బయట గడపాల్సి వస్తే, అదనంగా మరో మాస్క్‌‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి. పైగా ఒకే మాస్క్‌‌ ఎక్కువసేపు పెట్టుకోవడం కూడా ప్రమాదమే. కాబట్టి, ఎప్పటికప్పుడు మాస్క్‌‌లు చేంజ్‌‌ చేస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలతోపాటు రెగ్యులర్‌‌‌‌గా హ్యాండ్స్‌‌ వాష్‌‌ చేసుకుంటూ, శానిజైటర్ రాసుకుంటే చాలావరకు కరోనా వస్తే ప్రమాదాన్ని తప్పించు కోవచ్చు.