Health Alert : దెబ్బ తిగిలితే ఐస్ క్యూబ్స్ ఎందుకు పెడతారు.. కారణాలు ఏంటీ..?

Health Alert : దెబ్బ తిగిలితే ఐస్ క్యూబ్స్ ఎందుకు పెడతారు.. కారణాలు ఏంటీ..?

ఐస్ క్యూబ్స్ ఆరోగ్య పరంగా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టకపోయినా, నొప్పి కలుగుతున్నా ఆ ప్రదేశంలో ఐస్ క్యూబ్ తో రుద్దితే రక్తం గడ్డకట్టడం ఆగి, నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది. కాలిన గాయాలపై ఐస్ క్యూబ్ పెడితే మంట తగ్గి, గాయం త్వరగా మానుతుంది. గొంతులో ఏదైనా ఇరుక్కుని నొప్పి కలిగితే, గొంతుపై క్యూబ్లో మెల్లిగా రుద్దితే విముక్తి కలుగుతుంది.

కీళ్ల నొప్పులు ఉన్న చోట ఐస్ క్యూబ్ ని రెండు నిమిషాల పాటు ఉంచాలి. రోజూ అలా పదిసార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి. ముక్కుకి దెబ్బ తగిలి రక్తం వస్తే, ఐస్ ముక్కలను బట్టలో చుట్టి ముక్కుమీద పెడితే, కొద్దిసేపటికి రక్తస్రావం ఆగుతుంది. కిందపడి శరీరంలోని అవయవాలు బెణికితే ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఐస్ క్యూబ్ తో ఆ వాపు తగ్గించవచ్చు అంటున్నారు. వైద్య నిపుణులు. వీటిని వేసవి కాలంలో ఎక్కువగా వాడతారు. కానీ అన్ని కాలాల్లో ఈ క్యూబ్స్ ని ఉపయోగించవచ్చు.