
నగరంలో తానో గొప్ప డాక్టర్ ను అని తప్పుడు పేరును చెప్పుకుంటూ డేటింగ్ యాప్ లలో వారిఫోన్ నంబర్స్ సేకరించి అమ్మాయిలను,మహిళలను పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులుఅరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా లక్ష్మినగర్కు చెందిన గొల్లలదొడ్డి అబ్దుల్లా కొంత కాలంక్రితం నగరానికి వచ్చి మణికొండ లోని పాపలగూడ లో నివాసం ఉంటూ కూకట్ పల్లిలోనిసిల్ఫి ఎలక్ట్రానిక్స్ లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
డేటింగ్స్ సైట్ లలో తన పేరు డాక్టర్. కార్తీక్ రెడ్డి అని తాను నగరంలోని ఓ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో పేరున్న అనస్తీసియా వైద్యుడిగా పరిచయం చేసుకొని అమ్మాయిలు, మహిళలతో సన్నిహితంగా ఉంటూ వారితో పర్సనల్ చాట్చేస్తూ..వారితో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకొని వారి ఫొటోలు,వీడియోలు సేకరిస్తాడు. ఇలావారితో టైంపాస్ చేస్తాడు..కొద్ది రోజుల తర్వాతవారు దూరం అయిన వెంటనే ఫొటోలు సోషల్మీడియాలో పెడుతానని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
ఇలా ఇతని చేతిలో మోసపోయివేధింపులు తట్టుకోలేని ఓ బాధితురాలు మార్చ్ 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులుఅతడిని తన సొంత ఊరు కర్నూల్ లోని లక్ష్మినగర్ లో అరెస్ట్ చేశారు.అతడు నగరంలో చాలామంది మహిళలను,యువతులను మోసం చేసిసుమారు రూ. 4లక్షల వరకు వసూల్ చేసినట్లుపోలీసులు తెలిపారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల చేతిలో పడవద్దని డేటింగ్ వంటి యాప్ లకు దూరంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులుసూచించారు.