మెడికో సూసైడ్ కేసులో డాక్టర్ అరెస్ట్

మెడికో సూసైడ్ కేసులో డాక్టర్ అరెస్ట్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి కేసులో డాక్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జోగులాంబ గద్వాల జిల్లా మావనపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య(23), ఎంబీబీఎస్  హౌస్ సర్జన్‌గా చేరింది. సికింద్రాబాద్ అల్వాల్​కు చెందిన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ అదే కాలేజీలో సీనియర్ రెసిడెంట్‌ గా చేస్తున్నాడు. 

గతేడాది వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రణయ్ తేజ్ ఆమెతో చనువు పెంచుకుని, అనంతరం కులాలు వేరని దూరంపెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన లావణ్య ఈనెల3న కాలేజీ హాస్టల్ రూమ్ లో గడ్డి మందును ఇంజక్షన్ చేసుకుంది. రూమ్ మేట్స్ హైదరాబాద్ నిమ్స్‌ కు తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె చనిపోయింది. మృతురాలి అక్క శిరీష ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.