కడుపులో 187 నాణేలు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్లు

కడుపులో 187 నాణేలు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్లు

కర్ణాటక బాగల్ కోట్లోని ఓ హాస్పిటల్లో వింత ఘటన జరిగింది. ఓ పేషెంట్కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు అతని కడుపులో నుంచి 187 నాణేలను బయటకు తీశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న  ద్యామప్ప అనే వ్యక్తి కొంతకాలంగా కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని హాస్పిటల్లో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్నట్లు గుర్తించారు. 

దాదాపు 2 గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసిన డాక్టర్లు మొత్తం 187 నాణేలను బయటకు తీశారు.ద్యామప్ప పికా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి ఉన్న వారు బాధపడేవారు గడ్డి, బొమ్మలు, సుద్ద ముక్కలు, ఇతర గట్టి పదార్ధాలను తింటారని తెలిపారు.