జేఎన్ 1 వైరస్ తో ప్రమాదం లేదు .. వదంతులు నమ్మొద్దు

జేఎన్ 1  వైరస్ తో ప్రమాదం లేదు .. వదంతులు నమ్మొద్దు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 4 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 63 కేసులున్నాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 53 కేసులు ఉన్నాయి. 

అయితే కొత్త వైరస్ జేఎన్1 తో ప్రమాదం లేదని చెబుతున్నారు డాక్టర్లు. కొవిడ్ కేసులపై వదంతులు నమ్మొద్దంటున్నారు. సాధారణ మరణాలను కూడా కొవిడ్ మరణాలుగా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు డాక్టర్లు.  ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు.  

కొవిడ్  నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్యారోగ్యశాఖతో దఫల వారిగా హెల్త్ మినిస్టర్ రివ్యూలు చేస్తున్నారని చెప్పారు.  కేంద్రం హెచ్చరికలతో ముందస్తు చర్యలకు ప్రభుత్వ దవాఖానాలు సిద్ధం చేశామన్నారు.  అర్టీపీసీఆర్, పీపీఈ కిట్స్, మెడిసిన్, అక్సిజన్ ఇక్యూంప్మెంట్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా 63 కేసులుంటే  హైదరాబాద్ లోనే  53 కేసులు నమోదైనట్లు చెప్పారు.   కోవిడ్ పాజిటీవ్ వచ్చినా తొందరగానే కోలుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు.