రోజూ ఒక పండు.. తింటే లాభాలు మెండు!

రోజూ ఒక పండు.. తింటే లాభాలు మెండు!

ప్రజల జీవనంలో భాగం అయిపోయిన పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రతి రోజూ ఒక పండు తినడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని అంటున్నారు వైద్యులు. మన శరీరంలో రెండు రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి బాడీలో ఎక్కువ కాలం ఉండేవి, మరొకటి లిక్విడ్ రూపంలో బయటకి వెళ్లిపోయేవి. వీటిని బ్యాలెన్స్ చేయాలంటే తప్పనిసరిగా పండ్లు తీసుకోవాలి. 

ప్రయోజనాలేంటి...

పుష్కలంగా ఫైబర్ : పండ్లలో ఉండే ఫైబర్ ఒంటికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగం చేయడంతో పాటు పని తీరును మెరుగు పరుస్తుంది. మలబద్ధకం,ఫైల్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
బరువు తగ్గడం : రోజూ ఒక పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చు. పండ్లలో ఉండే పోషకాలు చెడు కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. బరువు తగ్గుదలలో తోడ్పడతాయి.
విటమిన్లు పుష్కలం : విటమిన్  సి వంటి పోషకాలు లిక్విడ్ రూపంలో శరీరం నుంచి వెళ్లిపోతాయి. వీటిని బ్యాలెన్స్ చేయడానికి పండ్లు ఉపయోగపడతాయి.
అవయవాల ఆరోగ్యం : యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు శరీరంలోకి కీలకమైన ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, పేగులు లాంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. 
చర్మం, జుట్టు ఆరోగ్యం : పండ్లలో ఉండే ప్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మ అందాన్ని రెట్టింపు చేయడంలో ఉపయోగపడతాయి. జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 
ఫ్రూట్స్ తినడం వల్ల ఇవే కాదు.. ఇంకా ఎన్నో ఉన్నాయి.
అందుకే డాక్టర్లు కూడా తరచూ పండ్లు తీసుకోమని చెబుతారు.  మరి రోజుకి ఒక్కసారైనా పండ్లు తినేద్దామా మరి.