F5 బటన్‌ నొక్కడం వల్ల కంప్యూటర్‌ రిఫ్రెష్ అవుతుందా?

F5 బటన్‌ నొక్కడం వల్ల  కంప్యూటర్‌ రిఫ్రెష్ అవుతుందా?

మనలో చాలా మందికి కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే రిఫ్రెష్ చేసే అలవాటు కూడా ఉంటుంది. అందుకోసం వందకు  99 శాతం మంది -కీప్యాడ్ లోని F5 బటన్‌ను నొక్కుతారు.  F5 బటన్‌ నొక్కడం వలన కంప్యూటర్‌ రిఫ్రెష్ అవుతుందని, హ్యాంగింగ్ సమస్య తీరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు.  దీని వెనుక కారణం వేరే ఉంది. F5 బటన్‌ను పదే పదే నొక్కడం వల్ల RAM స్పేస్ క్లియర్ అవుతుందని తద్వారా సిస్టమ్‌ని వేగవంతం చేస్తుందని  చాలా మంది నమ్ముతారు.

అయితే ఇది కేవలం భ్రమ మాత్రమే.  F5 బటన్‌ను పదే పదే నొక్కి రిఫ్రెష్ చేసినప్పుడల్లా సిస్టమ్ వేగాన్ని పెంచదు.  స్క్రీన్‌లో ఓపెన్ పేజీని మాత్రమే రీలోడ్ చేస్తుంది.  డెస్క్‌టాప్‌లోని ఫోల్డర్‌లు సరిగ్గా అమర్చబడకపోతే, F5 బటన్‌ను నొక్కితే, అన్ని ఫోల్డర్‌లను రిఫ్రెష్ చేసి, వాటిని ఒక వరుసలో ఉంచుతుంది.