వరల్డ్ రికార్డేమో : నడి రోడ్డుపై గంటలో 29 మందిని కరిచిన కుక్క

వరల్డ్ రికార్డేమో : నడి రోడ్డుపై గంటలో 29 మందిని కరిచిన కుక్క

 చెన్నైలోని రద్దీగా ఉండే  జీఏ రోడ్‌లో  నవంబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం ఒక వీధికుక్క స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. గంటలోపే దాదాపు 29 మందిని కరిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని వాణిజ్యపరంగా రద్దీగా ఉన్న రాయపురం ప్రాంతంలో కుక్క రోడ్డుపై పడి ఉంది. 

అది అకస్మాత్తుగా  మనుషులపై దాడికి దిగింది. దీంతో దాదాపు  గంటలోపే 29 మందిని కరిచింది. గాయపడిన వారిలో పాఠశాల విద్యార్థులు, వృద్దులు కూడా  ఉన్నారు.  గాయపడిన వారందరినీ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటన అనంతరం స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపేశారు.  

చనిపోయిన కుక్కను పోస్ట్‌మార్టం నిమిత్తం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మద్రాస్ వెటర్నరీ కాలేజీకి పంపించారు.   కుక్కల బెడదను అరికట్టేందుకు స్టెరిలైజేషన్ డ్రైవ్‌లు నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెలలో వీధికుక్కలు దాదాపు 1,960 మందిని కరిచాయని చెప్పి్ంది.  

ALSO READ : కొత్త సిమ్ కార్డు కావాలా.. అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..