కుక్కలు కూడా రీల్స్ చేస్తున్నాయి.. ఇక మనుషులు ఏం చేయాలో

కుక్కలు కూడా రీల్స్ చేస్తున్నాయి.. ఇక మనుషులు ఏం చేయాలో

దేశంలో టిక్ టాక్ ను నిషేధించినప్పట్నుంచి జనాలంతా ఇన్ స్టా రీల్స్ పైనే ఫోకస్ చేశారు. పలు పాటలకు, వాయిస్ లకు రీల్స్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక థీమ్ తో వైరల్ అవుతున్నారు. అయితే ఈ రీళ్లకు మనుషులే కాదు.. జంతువులు కూడా స్పందిస్తున్నాయి. అవి కూడా మనుషుల వలె వీడియోలు చేస్తూ వైరల్ అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రీల్స్ పిచ్చి ఇప్పుడు జంతువులకు కూడా ఎక్కేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కుక్క డ్యాన్స్ చేస్తూ కనిపించడమే కాకుండా సొంతంగా రీల్ కూడా చేసింది.

ఈ ఫన్నీ వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. యజమానే కుక్కకు ఈ తరహా శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ శిక్షణ అద్భుతమైన ఫలితాన్ని చూపించింది. అదే కుక్క ఒక రీల్‌ చేయడం. ఈ వీడియో చూస్తున్న వారెవరైనా కుక్క ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు. కుక్క కదలికలు అందరినీ ఆకర్షించడం మరో ప్రత్యేకత.

ఈ వీడియో ప్రారంభంలో కుక్క ఫోన్ రికార్డ్ బటన్ నొక్కటం కనిపిస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి మొబైల్ చూస్తూనే అడుగు వేస్తుంది.అలా నోరా ఫతేహీ డ్యాన్స్ స్టెప్పులు వేసి అందర్నీ మైమరిపిస్తోంది. ఆ తర్వాత, ఆ కుక్క స్లో మోషన్‌లో నడవడం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కుక్కకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చినందుకు దాని యజమానిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు,

మిలియన్ల కొద్దీ వ్యూస్..

కుక్క రీల్ కు సంబంధించిన ఈ  వీడియో Instagram లో dog._lovers001 అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీన్ని ఇప్పటివరకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. తన దగ్గర మూడు కుక్కలున్నాయని.. వాటికి అలాంటి నటన దేనికీ రాదని ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరికొందరేమో కుక్క క్యాట్‌వాక్‌ను ప్రశంసించారు. ఏదేమైనా ప్రతి ఒక్కర్నీ నవ్వించే, ఆశ్చర్యపర్చే ఈ వీడియో... ప్రస్తుతం వైరల్ గా మారింది.

మొత్తానికి కుక్కలు కూడా రీల్స్ చేస్తున్నాయి.. ఇక మనుషులు ఏం చేయాలంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మనుషులు చేయాల్సిన కుక్కలు, పిల్లులు చేస్తే.. ఇక మనుషులు చేసే వాటికి విలువ ఏముంటుందంటూ తమదైన శైలిలో చమత్కారాలు వేస్తున్నారు. నిజమే కదా.. షార్ట్స్, రీల్స్ కుక్కలే చేసేస్తే.. మనుషులు ఏం చేయాలి చెప్పండీ..

https://www.instagram.com/reel/CrDLWhyAifK/?utm_source=ig_embed&ig_rid=dc738ecf-abb4-47a4-a7bc-0b7980e25fc1