కుక్కను కారుకు కట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వ్యక్తి

కుక్కను కారుకు కట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వ్యక్తి

మానవత్వం మంట కలిసిందనడానికి ఈ ఘటన చాలు. ఓ వ్యక్తి కుక్కను కారుకు కట్టి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళంలో జరిగింది. స్థానికంగా నివసించే యూసుఫ్ అనే 62 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒక కుక్క ఆయన ఇంటి దగ్గర అరుస్తూ.. ఆ ప్రాంతమంతా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో విసుగుచెందిన యూసుఫ్.. కుక్కను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టాలని అనుకున్నాడు. అందుకోసం యూసుఫ్ ఆ కుక్కను తన కారుకు వెనక భాగాన తాడుతో కట్టి లాక్కెళ్లాడు. కుక్క కూడా కారుతో పాటు కొంతదూరం పరిగెత్తింది. అలా కాసేపు పరిగెత్తిన కుక్క.. అలసిపోయి కిందపడింది. అయినా కూడా యూసుఫ్ కారును ఆపకుండా.. అలానే లాక్కెళ్లాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగింది. కారు వెనకాలే వెళ్తున్న అఖిల్ అనే బైకర్ ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో కేరళ పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. జంతువులను చంపడం, విషప్రయోగం చేయడం, జంతువులను హింసించడం, మరియు జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు.

For More News..

త్రివిధ దళాలలో పనిచేసిన ఒకే ఒక్కడు.. నేడు వందో బర్త్‌డే

గొడవ ఆపడానికిపోయిన యువకుడికి 22 కత్తిపోట్లు

మధ్యాహ్నం రాజీనామా.. కేటీఆర్ ఫోన్ కాల్‌తో రాత్రి విత్ డ్రా

నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం