వామ్మో కుక్కలు..మాసాయిపేటలో 20 మందిపై కుక్కల దాడి.. నలుగురి పరిస్థితి విషమం

వామ్మో కుక్కలు..మాసాయిపేటలో 20 మందిపై కుక్కల దాడి.. నలుగురి పరిస్థితి విషమం

వీధికుక్కల దాడితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కుక్క కనిపించిందా అంతే భయంతో వణికిపోతున్నారు. వీధుల్లో స్వైర విహారం చేస్తూ చిన్నా పెద్దా అందరిపై దొరికిన వాళ్లను దొరికినట్లే కరిచి గాయపరుస్తున్నాయి. 

మంగళవారం (ఆగస్టు 26) మెదక్ జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. మాసాయిపేటలో 20మందిపై వీధికుక్కలు దాడి చేశాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్రావుపేటలో ఏడాది చిన్నారిపై పిచ్చి దాడితో తీవ్రగాయాలయ్యాయి. 

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీధికుక్కల దాడులతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో స్థానిక ప్రభుత్వం డైలమాలో పడ్డాయి. ఇటీవల ఢిల్లీలో వీధికుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జంతు ప్రేమికులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. 

►ALSO READ | Stray Dogs :ఇంటి వరండాలో ఆడుకుంటుండగా..చిన్నారిపై పిచ్చికుక్క దాడి.. తీవ్రగాయాలు