వైజాగ్ లో డాలర్ శేషాద్రి హఠాన్మరణం

V6 Velugu Posted on Nov 29, 2021

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్‌డీ అధికారి పి.శేషాద్రి.. ‘డాలర్’ శేషాద్రి కన్నుమూశారు. వైజాగ్‌లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రికి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే కన్నుమూశారు. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలోనే ఉన్నారు డాల్లర్ శేషాద్రి. 2007లో రిటైర్మెంట్ అయినా.. శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో OSDగా కోనసాగుతున్నారు.

డాలర్ శేషాద్రిపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో విమర్శలు కూడా అన్నే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ విరమణ పొంది పదేళ్లు దాటినా.. నేటికీ తన సేవలను కొనసాగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 50ఏళ్ల నుంచి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాలైన వ్యవహారాలపైన డాలర్ శేషాద్రికి పట్టుంది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలోనే తరించారు. డాలర్ శేషాది మరణం టీటీడీకి తీవ్ర నష్టం అన్నారు అదనపు ఈఓ ధర్మారెడ్డి. ఆయన లేని లోటు టీటీడీలో భర్తీ కాదన్నారు. 

 

Tagged TTD, ap news, dollar seshadri died, dollar seshadri death

Latest Videos

Subscribe Now

More News