ప్రముఖ సింగర్ పై లైంగిక, గృహ హింస కేసు

V6 Velugu Posted on Aug 03, 2021

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ సింగర్, నటుటు యోయో హనీ సింగ్ పై గృహ హింస, లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఆయన భార్య షాలినీ తల్వార్ చేసిన ఫిర్యాదు మేరకు గృహ హింస, ఆర్ధిక మోసం.. లైంగిక వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయకుడిగానే కాదు.. నటుడిగా కూడా వరుస ఆఫర్లతో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న హనీసింగ్ పై కేసు నమోదు కావడం కలకలం రేపింది.
దాదాపు పదేళ్లుగా బాలీవుడ్ లో పాటలు పడుతూ.. అడపా.. దడపా నటిస్తున్న హనీసింగ్ కు 2011లో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోనె నటించిన ‘‘కాక్ టెయిల్’’ సినిమాలో అంగ్రేజీ బీట్ పాటతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆఫర్లు పెరిగాయి. ఈ క్రమంలోనే 2014లో తనకు పెళ్లయిన విషయాన్ని బయటపెట్టి అందరికీషాక్ ఇచ్చాడు హనీసింగ్. ‘‘రా స్టార్’’ అనే రియాలిటీ షోలో తన భార్య ను పరిచయడం చేసి అభిమానులతోపాటు బాలీవుడ్ ఇండస్ర్ట్రీకి బిగ్ షాక్ ఇచ్చాడు. అంతవరకు అతడు అవివాహితుడుగానే భావించే వారు. 
కాపురంలో ఏం జరిగిందో కానీ.. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య జరుగుతున్న తగువులు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య షాలినీ తల్వార్ నేరుగా తీస్ హజారీ కోర్టులో తన భర్తపై కేసు నమోదు చేయమంటూ పిటిషన్ దాఖలు చేసింది. తనను మానసికంగా.. శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని.. వాపోయింది. ఉమ్మడిగా తమ పేరుమీద ఉన్న ఆస్తులు అమ్మకుండా చూడాలని కోర్టును వేడుకుంది. దీంతో స్పందించిన కేసు ఆమె సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్ల్లకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈనెల 28వ తేదీలోగా సమాధానం చెప్పాలంటూ కోర్టు ఆదేశించింది. 
 

Tagged bollywood today, bollywood latest updates, bollywood industry updates, singer honey singh, domestic violence case against, singer and actor honey singh, honey singh wife Shalini talwar

Latest Videos

Subscribe Now

More News