మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

బాదుడే..బాదుడు..సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర 3 రూపాయల 50 పైసలు పెంచారు. దీంతో డొమెస్టిక్ సిలిండర్ ధర వెయ్యి మూడు రూపాలకు చేరింది. వాణిజ్య సిలిండర్ ధరను 8 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర వెయ్యి దాటింది.

తాజా పెంపుతో హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ వెయ్యి 56 రూపాయలకు పెరిగింది. ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు వాడే సిలిండర్ ధర వెయ్యి మూడు రూపాయలకు చేరింది. కోల్ కతాలో వెయ్యి 29 రూపాయలు, చెన్నైలో వెయ్యి 18 రూపాయల 50 పైసలకు పెరిగింది. 12 రోజుల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఈనెల 7న సిలిండర్ పై 50 రూపాయలు పెరిగింది.

ఇక 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో.... ప్రస్తుతం సిలిండర్ ధర 2 వేల 364 రూపాయలకు చేరింది. 19 రోజలు వ్యవధిలో కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న కమర్షియల్ సిలిండర్ ధర 102 రూపాయల 50 పైసలు పెరిగింది.

మరిన్ని వార్తల కోసం

బీరుపై 10, క్వార్టర్ పై 10, హాఫ్ బాటిల్ పై 20 పెంపు

తీర్పు ఆలస్యమైతే న్యాయం జరిగేదెలా?