డచ్  ఫ్యాషన్ డిజైనర్ గౌన్ తో స్కై డైవింగ్

డచ్  ఫ్యాషన్ డిజైనర్ గౌన్ తో స్కై డైవింగ్

13000 మీటర్ల ఎత్తులో..గంటకి 300 కిలోమీటర్ల వేగంతో  స్కై డైవింగ్​ చేసిందామె. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్​లో ఇంకో స్పెషాలిటీ ఉంది. మామూలుగా స్కై డైవింగ్​ అంటే దానికోసం ప్రత్యేకంగా తయారుచేసిన సూట్​ కంపల్సరీ. కానీ, ఇక్కడ ఫేమస్​ డచ్​ ఫ్యాషన్​ డిజైనర్​ ఐరస్​ వాన్​ హెర్పన్​ ​డిజైన్​ చేసిన లెహంగాతో స్కై డైవింగ్​ చేసిందీమె. ఫ్యాషన్​ షో కోసం ఈ స్టన్నింగ్​ స్టంట్ చేసిన ఈమెకి​ ​మన దేశ మూలాలున్నాయి.

ఆకాశంలో ఫ్యాషన్​ షోతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ స్కై డైవర్​ పేరు డొమిటైల్​ కిగర్​. ఈ స్కై డైవర్​ తాతముత్తాతలు మన దేశానికి చెందినవాళ్లే. కానీ, డొమిటైల్ ఫ్యామిలీ మాత్రం ప్యారిస్​లో సెటిల్​ అయ్యింది. పుట్టి,పెరిగిందంతా ప్యారిస్​లోనే అయినా ఇండియా అంటే చెప్పలేనంత ప్రేమ డొమిటైల్​కి. ​ స్కై డైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే చిన్నవయసులోనే  స్కై డైవింగ్​పై పట్టు సాధించింది. తన ప్రతిభతో ఇంటర్నేషనల్​ స్కై డైవింగ్​ టీమ్స్​​లో చోటు దక్కించుకుంది. స్కై డైవింగ్​ ట్రైనర్​గా కూడా  రాణిస్తోంది.గడిచిన ఇరవై యేళ్లలో పైనుంచి ఎగిరి విమానాల్లోంచి దూకుతూ ఎన్నో  రిస్కీ ఫీట్లు చేసిన డెకోవిచ్​  ఫ్రెంచ్​ ఇంటర్నేషనల్​ స్కై డైవింగ్​ కమీషన్​ , ఫెడరేషన్​లలో కీలక  మెంబర్​గా ఈ ఏడాది ఎంపికయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే రీసెంట్​గా  ఫ్యాషన్​ డిజైనర్​ ఐరస్​ ‘వింటర్​ 2021–2022’​ ‘ఎథిరైస్’ కలెక్షన్​తో ఈమె చేసిన స్కై డైవింగ్​ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ డిజైనర్​ గౌన్​లో డెకొవిచ్​ చేసిన స్టంట్స్​​ హాట్​ టాపిక్​ మారాయిప్పుడు.
ఈ స్టంట్​​ కోసం..
చిన్నప్పట్నించీ స్కై డైవింగ్​లో ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టింది డెకోవిచ్​. కానీ, ఇంతకుముందెప్పుడూ ఇలా డిజైనర్​ వేర్​లో స్కై  డైవింగ్​ చేసింది లేదు. అసలు అంతటి పొడవాటి, హెవీ డిజైన్​ డ్రెస్​లు వేసుకునే అలవాటే లేదట ఆమెకి. కానీ, డచ్​ ఫ్యాషన్​ డిజైనర్​ ఐరస్​ వాన్​ హెర్పన్ ‘పారిస్​ ఫ్యాషన్​ వీక్’​లో ప్రదర్శించబోతున్న తన వింటర్​ కలెక్షన్​ కోసం ఈ కాన్సెప్ట్​ చెప్పగానే ఓ ఛాలెంజ్​​లా తీసుకుని యాక్సెప్ట్​ చేసింది. ఈ ప్రాజెక్ట్​​ కోసం మూడు నెలలు కష్టపడిందట డొమిటైల్. అయితే ఇక్కడ ఆ ఫ్రెంచ్​ డిజైనర్​ పనితనాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే. మామూలుగా కాస్త గాలి తగిలితేనే డ్రెస్​ అంతా చెల్లాచెదురు అయిపోతుంది. అలాంటిది 13000 మీటర్ల ఎత్తులో.. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో స్కై డైవింగ్​ చేసినా  డ్రెస్​ కొంచెం కూడా చెదరలేదు. అంతటి స్ట్రాంగ్​ ఫ్యాబ్రిక్​తో డ్రెస్​ డిజైన్​ చేసిందామె.

‘‘నా పూర్తి పేరు డొమిటైల్​ లక్ష్మీ కిగర్..చాలా ఇష్టంగా నాకు ఈ పేరు పెట్టారు మా నాన్న. ఇండియన్ కల్చర్​పై ఉన్న ప్రేమ ఆయన్ని చాలాసార్లు అక్కడికి తీసుకెళ్లింది. ప్యారిస్​లోని మా సొంతింట్లోనూ ఇండియన్​ పెయింటింగ్స్​, శిల్పాలు చాలా  ఉన్నాయి. వాటిని చూపిస్తూ నాన్న ఇండియన్​ కల్చర్​, హిస్టరీని చెప్తుండేవాళ్లు. నాన్న మాటల్లోనే కాదు నేరుగా కూడా ఇండియన్​ కల్చర్​ని చూశా. నా ఇరవై యేళ్ల వయసులో  ఇంటర్న్​షిప్​లో భాగంగా ఇండియాకి వచ్చా. ఆరు నెలలు రాజస్తాన్​లోని ఫతేఫూర్​, షెకావతి, నాడిన్స్ హవేలీలో గడిపా.  పోయిన ఏడాది కూడా మా ఆయనతో కలిసి ఇండియా వచ్చా. మళ్లీ ఎప్పుడు వస్తానా? అని ఎదురుచూస్తున్నా.
                                                                                      - డొమిటైల్ లక్ష్మీ కిగర్​