డాన్ 360.. రౌడీలను బుక్ చేసుకునే యాప్

డాన్ 360..  రౌడీలను బుక్ చేసుకునే యాప్

మొబైల్ యాప్‌‌తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు అనే కొత్త కాన్సెప్ట్‌‌తో యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘డాన్ 360’.  భరత్ కృష్ణ, ప్రియా హెగ్డే జంటగా,   శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్, సతీష్ సారిపల్లి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌‌గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అతిథిగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు. 

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు భరత్ కృష్ణ మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో ఈ కథను రాశాను. కొత్తదనం ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నాడు.  కథ విన్నప్పుడు ఎంతో ఎక్సయిటింగ్‌‌గా ఉందని  చెప్పింది ప్రియా హెగ్డే. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.