భారతీయ శాస్త్రవేత్తకు ట్రంప్ సర్కారు కీలక పదవి

భారతీయ శాస్త్రవేత్తకు ట్రంప్ సర్కారు కీలక పదవి

భారతీయ అమెరికన్‌ సేతురామన్ పంచనాథన్ కు ట్రంప్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. ఆరిజోనా స్టేట్ వర్శిటీలో ముఖ్య పరిపాలనాధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్న సేతురామన్ ను ప్రతిష్టాత్మక NSF డైరెక్టర్ గా నియమించింది. ప్రస్తుత డైరెక్టర్ ప్రాన్స్ కార్డోవా పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో సేతురామన్ డైరెక్టర్ పదవిని చేపట్టనున్నారు. వైద్య రంగంతో సంబంధం లేని సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రాథమిక పరిశోధన, విద్యకు ఉద్దేశించిన జాతీయ సైన్స్ ఫౌండేషన్ (NSF) అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎలక్ట్రానిక్స్ డిగ్రీ, మద్రాస్ IITలో ఎలక్ట్రానిక్స్ లో పీజీ చేసిన సేతురామన్ కెనడాలోని ఒట్టవా వర్భిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.