
యూస్ హౌస్‌లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
యూఎస్ ప్రతినిధుల సభ డోనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించడానికి తీర్మానం చేసింది. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడవ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఎక్కువ మంది ఓటు వేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు సమావేశానికి ఆటంకం కలిగించారని అభియోగాలు మోపబడ్డాయి. ఈ అభియోగాలను సమర్థిస్తూ 218 ఓట్లు అనుకూలంగా వచ్చాయి మరియు 163 ఓట్లు దీనికి వ్యతిరేకంగా వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ యొక్క 243 సంవత్సరాల చరిత్రలో ఏ అధ్యక్షుడిని అభిశంసన ద్వారా పదవి నుండి తొలగించలేదు. దీనికి 100 మంది సభ్యుల సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం, అంటే కనీసం 20 మంది రిపబ్లికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి డెమొక్రాట్లలో చేరవలసి ఉంటుంది.
నవంబర్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలనే ఉద్దేశంతో ట్రంప్.. 2020 ఎన్నికల్లో సహాయం చేయాల్సిందిగా ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడిన ఫోన్ కాల్ తీవ్ర దుమారం రేపింది. డెమొక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థి మరియు ట్రంప్ రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై దర్యాప్తు చేయమని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా 73 ఏళ్ల ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని అభియోగం మోపబడింది. డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రంప్‌పై అభిశంసనకు ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ నాన్సీ పెలోసి మూడు నెలల క్రితమే ప్రకటించారు.
తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనం కోసం ట్రంప్ 2016 ఎన్నికలలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ మరియు అతని కుమారుడు హంటర్ బిడెన్‌పై దర్యాప్తు చేయాలని ఉక్రెయిన్ను కోరినట్లు తేలింది. అంతేకాకుండా, ఆయన తను జవాబుదారీతనం పైన, రాజ్యాంగం పైన మరియు అమెరికన్ ప్రజల పైన నిర్లక్ష్యం చూపారని తేలినట్లు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఒక లేఖలో తెలిపారు.
అయితే, ట్రంప్ మరియు అతని మిత్రపక్షాలు మాత్రం అభిశంసన చర్యలపై నినాదాలు చేశాయి. 2020 ఎన్నికలకు ముందే డెమొక్రాట్లు ట్రంప్‌ను అభిశంసించడానికి ముందుకెళ్తున్నారని వారు ఆరోపించారు. డెమొక్రాట్లు చట్టవిరుద్ధంగా మరియు, పక్షపాతంగా ఈ తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపిస్తూ హౌస్ స్పీకర్ పెలోసికి రాష్ట్రపతి మంగళవారం ఒక లేఖ రాశారు. డెమొక్రాట్లు పెట్టిన ఈ అభిశంసనతో స్పీకరైన మీరు తదుపరి చర్యలు తీసుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
యునైటెడ్ స్టేట్స్ యొక్క 243 సంవత్సరాల చరిత్రలో ఏ అధ్యక్షుడిని అభిశంసన ద్వారా పదవి నుండి తొలగించలేదు. దీనికి 100 మంది సభ్యుల సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం, అంటే కనీసం 20 మంది రిపబ్లికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి డెమొక్రాట్లలో చేరవలసి ఉంటుంది.
1868లో అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ను సభ అభిశంసించింది. కానీ, సెనేట్‌లో ఒక్క ఓటు మెజారిటీతో ఆయన తన అధ్యక్ష పదవి కొల్పోకుండా తప్పించుకున్నారు. ఆ తర్వాత 1974లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వాటర్‌గేట్ అవినీతి కుంభకోణంలో అభిశంసనను ఎదుర్కొన్నారు. అయితే నిక్సన్ మాత్రం సెనేట్ వాటిని ఆమోదించకముందే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వారిద్దరి తర్వాత 1998లో అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై కూడా అభిశంసన తీర్మానం పెట్టాలని సభ్యులు భావించారు. విచారణ చేసిన సెనేట్ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. దాంతో బిల్ క్లింటన్ అభిశంసనకు గురికాలేదు. ఇప్పుడు ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అభిశంసన ద్వారా ఆయన పదవి కొల్పోతే అమెరికా చరిత్రలో అభిశంసన ద్వారా ఆయన పదవి కొల్పోయిన మొదటి వ్యక్తి ఆయనే అవుతారు.
For More News..