ట్రంప్ కు సొంతంగా తాజ్ మహల్ ఉంది మీకు తెలుసా..?

ట్రంప్ కు సొంతంగా తాజ్ మహల్ ఉంది మీకు తెలుసా..?

డొనాల్డ్​ ట్రంప్​కు 30 ఏండ్ల కిందట్నే సొంతంగా తాజ్​మహల్​ ఉండేది! అమెరికాలోని న్యూజెర్సీలో 1990లోనే ట్రంప్​ఆ తాజ్​మహల్​ను కట్టించాడు. కానీ దానితో కలిసిరాక బాగా అప్పుల పాలైండు. తర్వాత అడ్డికి పావుశేరు రేటుకు దాన్ని అమ్మేసుకున్నడు. ఇంతకీ ట్రంప్​ కట్టించిన తాజ్​ మహల్​ ప్రేమ కోసం, ప్రేమగా కట్టించిన కట్టడం కాదు.. బాగా డబ్బు సంపాదించడం కోసం, డబ్బులతో గేమ్స్​ ఆడేందుకు కట్టిన కాసినో బిల్డింగ్. 1990 ఏప్రిల్​ ఐదో తారీఖున ట్రంప్​ ఆ తాజ్​ మహల్​ క్యాసినోను ఓపెన్​ చేశాడు. తాజ్​మహల్​ను తలపించేలా డోమ్​లాంటి పైకప్పు, మినార్లు,  ధగధగ లాడే లైట్లు, ఫౌంటేన్లతో బాగానే రిచ్​గా కట్టాడు. ట్రంప్​ ఎంటర్​టైన్​మెంట్​రిసార్ట్స్​ కంపెనీ పేరుమీద దాన్ని నడిపిండు. కానీ కొద్దినెలలకే బాగా నష్టాలొచ్చినయ్. బ్యాంకులకు అప్పులు తీర్చలేక ఆ కంపెనీ చేతులెత్తేసింది. చివరికి కొన్నేండ్ల కిందట్నే ఆ తాజ్​మహల్​ క్యాసినోను అగ్గువ ధరకే హార్డ్​ రాక్​ కేఫ్​ వాళ్లకు అమ్మేసిండు. ఇప్పుడు దానికి ట్రంప్​కు ఏం సంబంధం లేనట్టే. అయితే ఇప్పుడు ట్రంప్  అమెరికా ప్రెసిడెంట్​ హోదాలో భార్యాపిల్లలతో కలిసి ఆగ్రాలోని మన తాజ్​మహల్​ దగ్గరికి వచ్చిండు. ఫొటోలు దిగిండు. మరి దీనిని చూసే సరికి అప్పటి తాజ్​ మహల్​ కాసినో, అది తెచ్చిన నష్టాలు గుర్తొచ్చి ఉంటాయా? అని సోషల్​ మీడియాలో సెటైర్లు పడుతున్నయి.