వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్యాలెట్ పేపర్‌లో తన పేరు లేకపోవడంతోనే తమ పార్టీ ఓడిపోయిందని కామెంట్ చేశారు. ‘‘బ్యాలెట్ పేపర్‌లో ట్రంప్ పేరు లేదు. మరోవైపు ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉంది. ఈ రెండు కారణాల వల్లనే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టారు. పోల్‌స్టర్స్ సర్వే అభిప్రాయాన్నే ఆయన ఇక్కడ పోస్టు చేశారు.
