మైండ్ లేని ఎలన్ మస్క్తో మాటలేంటీ:తగ్గేదేలా అంటున్న ట్రంప్

మైండ్ లేని ఎలన్ మస్క్తో మాటలేంటీ:తగ్గేదేలా అంటున్న ట్రంప్

బిలియనీర్ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వైరం ముదిరింది.ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టాక వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ డెవలప్ అయినప్పటికీ తాజాగా వారిమధ్య విభేదాలు పెరిగాయి.ప్రస్తుతం వారిద్దరు బహిరంగంగా మాటల యుద్దం చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఎలాన్ మస్క్ కు, ట్రంప్ మధ్య వివాదం వచ్చింది.. ఎందుకు బహిరంగంగా తిట్టుకుంటున్నారు. ట్రంప్, ఎలాన్ మస్క్ వైరానికి కారణం ఏంటీ?..

శుక్రవారం (జూన్6) ABC న్యూస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్యూలో డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్ తో వివాదంపై తాను మాట్లాడదలుచుకోలేదని సమాధానం ఇచ్చారు.. గురువారం ఇద్దరి మధ్య జరిగిన సోషల్ మీడియా మాటల యుద్దం పై ప్రశ్నించగా.. ఆ మతిస్థిమితం లేని వ్యక్తితో నాకు మాటలేంటీ.. ప్రస్తుతం అతని గురించి మాట్లాడటం టైవేస్ట్ అన్నట్లుగా ట్రంప్ స్పందించారు. 

ట్రంప్ కు ఎలాన్ మస్క్ కు ఎక్కడ వివాదం వచ్చింది?  

గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ కు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం నడిచింది..ఒకరిపైఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నువ్వెంత అంత అంటే నువ్వెంత అనే స్థాయికి మాటలు పెరిగాయి.  ఇది బాగా వైరల్ అయింది. ఓ పన్నుల బిల్లువిషయంలో ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అందుకు ట్రంప్ బదులుగా  టెస్లా వంటి మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తానని బెదిరించారు.

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ పన్ను బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దారుణమైనది అని విమర్శించారు. ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ వాదించారు.ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) క్రెడిట్లు లేకపోవడం కూడా మస్క్ అసంతృప్తికి ఒక కారణంగా తెలుస్తోంది. 

మస్క్ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టెస్లా వంటి మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను, పన్ను రాయితీలను ఆపేస్తానని ట్రంప్ బెదిరించారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని, మస్క్ మద్దతు తనకు అవసరం లేదని ట్రంప్ తేల్చేశారు. 

దీనికి ప్రతిస్పందనగా మస్క్.. ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. తన మద్దతు లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని మస్క్ చెప్పారు. అంతేకాదు ఎప్స్టీన్ ఫైల్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆ స్కాం బయటికి రాకపోవడానికి అదే అసలు కారణమని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మస్క్ చెప్పారు. 

గతంలో ప్రభుత్వ వ్యర్థ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం "డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)" అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి ఎలాన్ మస్క్‌ను అధిపతిగా నియమించింది. మస్క్ ఈ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ట్రంప్‌తో మస్క్ సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ట్రంప్, ఎలాన్ మస్క్ మద్య వైరం టెస్లా షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రంప్, మస్క్ బహిరంగ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. 

మొదట్లో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ పన్ను విధానాలపై అభిప్రాయబేధాలు, ట్రంప్ బెదిరింపులు  మస్క్ ప్రతిస్పందనలు ముఖ్యంగా ఎఫ్ట్సీన్స్ ఫైల్ స్కాండల్ వ్యాఖ్యలతో ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది.