టిక్ టాక్ బ్యాన్ ఆలోచనలో డోనాల్డ్ ట్రంప్

టిక్ టాక్ బ్యాన్ ఆలోచనలో డోనాల్డ్ ట్రంప్

ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మంది యూజర్లున్న టిక్ టాక్ ను తమ దేశంలో బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్ టాక్ ద్వారా చైనా అమెరికన్ల రహస్యాలను సేకరిస్తోందని ఆయన అన్నారు. ట్రంప్ శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్ విలేకరులతో మాట్లాడారు. అత్యవసర కార్యనిర్వాహక ఉత్తర్వులను ఉపయోగించి టిక్ టాక్ ను బ్యాన్ చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమెరికా జాతీయ భద్రతను ప్రభావితం చేసే ఒప్పందాలపై దర్యాప్తు చేస్తున్న సిఎఫ్‌ఐయుఎస్ టిక్ టాక్ ను సమీక్షించిన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యకు దిగారు.
చైనా ఇంటెలిజెన్స్‌ ఈ యాప్ ద్వారా దేశ రహస్యాలను మరియు అమెరికా అధికారుల వ్యక్తిగతసమాచారాన్ని కొల్లగొడుతుందని ఆయన ఆరోపించారు. అమెరికాలో కూడా బాగా పాపులర్ అవుతున్న సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను త్వరలోనే నిషేధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు.

టిక్ టాక్ యాప్ ద్వారా చాలా మంది ఎంతో ఫేమస్ అయ్యారు. కొంతమందైతే దానికి బానిసలుగా మారారు. మరికొంతమంది దానిని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు.

For More News..

వీడియో: ఆవు మాంసం తరలిస్తున్నాడని.. తల మీద సుత్తితో కొట్టి..

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

‘సింగరేణి’లో కరోనాతో చనిపోతే రూ.15లక్షల పరిహారం