గ్రీన్​లాండ్​లో ఏముంది?

గ్రీన్​లాండ్​లో ఏముంది?

గ్రీన్​లాండ్​ దీవిని​ అమెరికా కొంటానంది. ఒక దేశానికి చెందిన భూభాగాన్ని మరో దేశం కొనడమేమిటని  ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జనం తిరగని ఏరియాల్లో ఈ గ్రీన్​ల్యాండ్ ఐలాండ్​ కూడా ఒకటి. ట్రంప్​కి వచ్చిన ఈ ఆలోచన వెనక ఆర్థిక, రాజకీయ, చారిత్రక కారణాలు ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖనిజాలపై చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికే ట్రంప్​ గ్రీన్​లాండ్​ కొనుగోలుకి ఆలోచిస్తున్నారని అంచనా. అలాగే గ్రీన్​లాండ్​ను అమెరికా సొంతం చేసుకుంటే రష్యా మిలటరీ రాకపోకలను అడ్డుకోవటం కూడా ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

గ్రీన్​లాండ్ ఒక ప్రత్యేక ప్రదేశం. ప్రపంచంలోని అతి పెద్ద దీవి. అన్ని దేశాల కన్నా అతి తక్కువ జనాభా గల ప్రాంతం. ఇది పేరుకే గ్రీన్​లాండ్​. మూడొంతుల భూమి పర్మనెంట్​గా ఐస్​ పొరతో కప్పి ఉంటుంది.   భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగంగా ఉంది. రాజకీయంగా, కల్చర్​పరంగా యూరప్​ ఖండంతో అనుబంధం కొనసాగిస్తోంది. గ్రీన్​లాండ్​కి అటానమస్​ స్టేటస్​ ఉన్నా డిఫెన్స్​, ఫారన్​ పాలసీలు మాత్రం డెన్మార్క్​ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ దేశం అనుమతి పొందటం కూడా ముఖ్యమే. ఇంతకీ ఆ నేల మీద అమెరికా అధ్యక్షుణ్ని ఆకర్షించిందేంటి?. ఏమీ లేకపోతే ఆయన దాన్నెందుకు కొనాలనుకుంటారు?. ఈ రెండు విషయాల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.

లైఫ్​ టైం డీల్​

అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ స్వయంగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారి. ఆ దృష్టితోనే గ్రీన్​లాండ్​ కొనుగోలును లైఫ్​ టైం డీల్​గా ఫీలయ్యారు. అంతేకాదు. దీని వెనక చారిత్రక కోణం కూడా ఉంది. గతంలో యూఎస్​ ప్రెసిడెంట్​ థామస్​ జెఫర్​సన్​ 1803లో ఫ్రెంచ్​ అధీనంలోని లూసియానాను ఇలాగే కొన్నారు. మరో అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్​ 1867లో రష్యా నుంచి అలాస్కాను ఇదే మాదిరిగా స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్​లాండ్​ను కొంటే తన పేరు కూడా అమెరికా చరిత్రలో నిలిచిపోతుందని ట్రంప్​ కోరుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.

చైనా, రష్యాలకు చెక్​ పెట్టడానికేనా!

ప్రపంచంలో ఇండస్ట్రియల్​ మెటల్స్​ విషయంలో ప్రస్తుతం చైనా డామినేషన్​ నడుస్తోంది. దానికి చెక్​ పెట్టడానికే ఈ మల్టీ బిలియన్​ డాలర్​ టేకోవర్​పై ట్రంప్​ సలహాదారులు ఆయనకు నూరిపోశారనే వాదన కూడా వినిపిస్తోంది. గ్రీన్​లాండ్​ను అమెరికా సొంతం చేసుకుంటే రష్యా మిలటరీ రాకపోకలను అడ్డుకోవటం కూడా ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్​లాండ్ ప్రధాని కిమ్​ కీల్​సెన్, డెన్మార్క్​ ​ ప్రైమ్​ మినిస్టర్​ ఫ్రెడెరిక్​సన్​తో వచ్చే నెలలో ట్రంప్​ భేటీ కానుండటంతో ఈ కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ప్రపంచంలోని పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి!

గ్రీన్​లాండ్​ ఒప్పందం ఓకే అయితే ఇది ప్రపంచంలోని అతి పెద్ద మెటల్​ ప్రొడ్యూసింగ్​ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. గ్రీన్​లాండ్​లోని మినరల్స్​, డిఫెన్స్​ అసెట్స్​ అన్నింటి విలువ కలిపితే 1.1 ట్రిలియన్​​ డాలర్ల వరకు ఉంటుందని చూచాయగా అంచనాలు వెలువడుతున్నాయి. డెన్మార్క్​​ మాత్రం ఈ దీవి రేటును సుమారు 700 మిలియన్​ డాలర్లకు ఫైనల్​ చేయొచ్చని ట్రంప్​ అనుకుంటున్నారు. అయితే డెన్మార్క్​ దీనికి భిన్నంగా స్పందించటం చెప్పుకోదగ్గ విషయం.

గ్రీన్​లాండ్​ను అమ్మకానికి పెట్టం

గ్రీన్​లాండ్​ రేటుపై నడుస్తున్న చర్చలను డెన్మార్క్​ ప్రధాని ఫ్రెడెరిక్​సన్​ తోసిపుచ్చారు. ‘ఈ ప్రాంతాన్ని కొనాలని యూఎస్​ అనుకుంటోందేమో. మేం మాత్రం అమ్మకానికి పెట్టం’ అని ఆయన తేల్చిచెప్పారు. గ్రీన్​లాండ్​కు అటానమస్​ స్టేటస్​ ఉన్నా డిఫెన్స్​, ఫారన్​ పాలసీలు డెన్మార్క్​ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి డెన్మార్క్​ ప్రభుత్వాన్ని కాదని అమెరికా ముందుకు పోవటానికి లేదు. మరో వైపు.. డొనాల్డ్​ ట్రంప్​ తన నంబర్​–1 ప్రయారిటీ గ్రీన్​లాండ్​ కొనుగోలు కాదని చెప్పారు. అయినా ఈ ప్రచారంపై చైనా, రష్యా ఎలా రియాక్ట్​ అవుతాయో చూడాలి. ఆర్థికపరంగా మరింత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. యూఎస్​ పాలసీ మేకర్లు, ట్రంప్​ అడ్వైజర్లు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.

అరుదైన ఖనిజాలు

గ్రీన్​లాండ్​ దీవిలో ఐసే ఎక్కువ భాగం ఆక్రమించినా, కొన్ని అరుదైన ఖనిజాలు (రేర్​ ఎర్త్​ మెటల్స్)కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. నియోడిమియం, ప్రాసియోడిమియం, డిస్ప్రోజియం, టెర్బియం, యురేనియం, జింక్​ బైప్రొడక్ట్స్​ నిల్వలు ఇక్కడ భారీఎత్తున ఉన్నట్లు గుర్తించారు. ఈ మెటల్స్​ని మొబైల్​ ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వాడతారు. ఈమధ్య ఎలక్ట్రిక్​ కార్ల మ్యాన్​ఫ్యాక్చరింగ్​లోనూ వినియోగిస్తున్నారు. ఈ మెటల్స్​ని చైనా వ్యాపారులు చాలా ఉదారంగా సప్లయి చేస్తున్నారని అమెరికా సంస్థలు ఇన్నాళ్లూ అనుకునేవి. కానీ.. చైనా కంపెనీలు ఈ గనుల్ని సెంట్రల్, సదరన్​ ఆఫ్రికా అంతటా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, చైనా ప్రెసిడెంట్​ జీ జిన్​పింగ్​ విదేశీ విధానాలు చాలా అగ్రెసవ్​గా ఉండడం, గ్లోబల్​ మార్కెట్​లో ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవటానికి ప్రయత్నించడం అమెరికాకి మంట పుట్టించాయి. దీంతో. రేర్​ ఎర్త్​ మెటల్స్​ కోసం చైనాపై ఆధారపడకుండా తన దారి తాను చూసుకోవడానికి నిర్ణయించుకుంది. దీన్నే ప్రధాన అజెండాగా మార్చారు. ఇందులో భాగంగానే గ్రీన్​లాండ్​లోని మినరల్స్​ను టార్గెట్​గా పెట్టుకున్నారు. ఆ దీవిలో 100 మిలియన్​ టన్నులకుపైగా ముడి ఖనిజం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్​లాండ్​ను కొనుక్కోవాలని ట్రంప్​ భావించటం ఇందులో భాగమేనని మరికొందరు వివరిస్తున్నారు.

దీవులు ఉండడానికే.. దేశమంటే కుదరదు

దీవుల్ని కొనడమేమిటనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రపంచంలో చాలామంది బిలియనీర్లు, పొలిటికల్​ ఆశ్రయం పొందాలనుకునేవారు, సొంతంగా ఒక స్థావరం కావాలనుకునేవాళ్లు తమకోసం ప్రత్యేక ఐలాండ్​లు ఉండాలనుకుంటారు. ఇది అందరికీ సాధ్యం కాదు. దండిగా సొమ్ములతోపాటు మంచి లైఫ్​ స్టయిల్​కూడా కోరుకునేవారికే వీలవుతుంది. అయితే, ఇక్కడో చిన్న విషయముంది. లగ్జరీ లైఫ్​ వరకు పర్వాలేదుగానీ, ఒక దీవిని కొనేసుకుని ఏకంగా రాజ్యం ఏర్పాటు చేసుకోవాలంటే కుదరదు.

ప్రపంచంలో శాటిలైట్​ సిస్టమ్​ వచ్చాక మ్యాప్​లోకి రాని ఐలాండ్​ అంటూ ఏదీ లేదు. ప్రస్తుతమున్న దేశాలన్నీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఐక్యరాజ్య సమితిలో క్లెయిమ్​ చేసుకున్నాయి. ఇండోనేసియా, మాల్దీవులు, వెస్టిండీస్​ వంటి అనేక దీవులతోకూడిన దేశాలు సైతం వాటి సరిహద్దుల దగ్గర బలం పెంచుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. అదీగాక, ఎవరైనా దీవులు కొనుక్కొని సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా కచ్చితమైన రికగ్నైజ్​డ్​ ప్రాసెస్​ ఏదీ వాడుకలో లేదు.  అన్నింటికీ మించి కొత్త దేశం (దీవి)లో లోకల్​ స్టేటస్​కోసం జనాభా పెరిగే అవకాశం లేనే లేదు. ప్రజలు లేకుండా దేశం ఎలా సాధ్యం? కనీసావసారాలకోసం దిగుమతులు తెచ్చుకోవాలన్నా సొంత కరెన్సీ, సొంత మార్కెటింగ్​ వ్యవస్థ, సొంత మిలిటరీ, టూరిజం అభివృద్ధికి ప్రణాళిక వంటివి తప్పనిసరిగా సమకూర్చుకోవాలి.  ఇవన్నీ కేవలం డబ్బుతోనే సాధ్యం కావు. హ్యూమన్​ రీసోర్సెస్​ చాలా కావాలి.

రహస్య దీవులేవీ లేవు :

ఏ దేశానికీ చెందని దీవులంటూ ఏమీ లేవు. సముద్రంలో 22 కిలోమీటర్ల వరకు పరిధి ఉంటుంది. దానికి అవతల మాత్రమే అంతర్జాతీయ జలాలుగా పేర్కొంటారు. అలాగే, ప్రత్యేక ఆర్థిక మండలం ప్రధాన భూభాగానికి 200 నాటికల్​ మైళ్ల (సుమారు 370 కిలోమీటర్ల)లో ఉండాలి. కరీబియన్​ దీవుల్లో మిస్టీరియోసా బ్యాంక్​ వాళ్లు ఎక్స్​క్లూజివ్​ ఎకనమిక్​ జోన్​ (ఈఈజడ్) ఏర్పాటు చేయాలనుకుంటే హోండూరస్​, కేమేన్​ ఐలాండ్స్​ (యూకే)ల మధ్య సముద్ర ఒప్పందం అవసరమైంది. అంటార్కిటికాలో ఎవరికీ చెందని భూభాగాలున్నా… అమెరికా సహా అన్ని పెద్ద దేశాలూ పెత్తనం సాగిస్తున్నాయి,

అమ్మకాలకు లేకపోలేదు

చాలా దేశాల్లో దీవులు అమ్మకానికి ఉంటాయి. వాటికోసం ప్రత్యేకించి బ్రోకరేజీ వ్యవస్థకూడా ఉంది. అంతమాత్రాన ఆ దీవిలో దేశం ఏర్పాటు కాదు. కేవలం ఒక ల్యాండ్​ ఓనర్​గానే ఉంటారు. కొన్నేళ్ల క్రితం రైట్​వింగ్ అమెరికన్లు హైతీకి చెందిన టార్చుగా ఐలాండ్​ని కొనేసి, లిబర్టేరియన్​ ప్యారడైజ్​ ఏర్పాటుకు ప్లాన్​ చేశారు. కానీ, అక్కడ నివసిస్తున్న వేలాది హైతీ ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇవ్వకపోవడంతో అమ్మడానికి హైతీ పాలకులు ఒప్పుకోలేదు. ఒకవేళ పసిఫిక్​, కరీబియన్​ దీవుల్లోని చిన్న దేశాల నుంచి బలవంతంగా దీవులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా ఇతర దేశాలు అడ్డుకుంటాయి.

మానవ వనరుల అవసరం

దీవుల్ని కొనుక్కున్నప్పుడు అక్కడ యజమానులు ఒక్కరే ఉండడం సాధ్యపడదు. అందులో నివసించడానికి తగిన జనాల్ని ఒప్పించి, తీసుకురావాలి. మనమే ఒక సొంత తెగగా ఏర్పడవచ్చునని చెప్పుకోవాలి. అప్పుడుకూడా ఇబ్బందులే. 19వ శతాబ్దం మధ్యలో బ్రిటన్ సహా వలస పాలకులంతా తమ తమ కాలనీలను పటిష్టం చేసుకుంటున్న దశలో… మిచిగాన్​ సరస్సులోని బీవర్​ ఐలాండ్​లో ఇలాంటి సమస్యే తలెత్తింది. క్రీస్టియానిటీని బలంగా పాటించే మోర్మాన్​ తెగవాళ్లు (ఐరిష్​ అమెరికన్లు) ఆ ఐలాండ్​లో స్థిరపడి సొంత రాజ్యం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా అమెరికన్​ అధికారులు సాగనివ్వలేదు.