అన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం

అన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి మహబూబాబాద్​పట్టణానికి చెందిన దాసరి శేఖర్ రత్న ప్రశాంతి దంపతులు రూ.50,116 విరాళం అందజేశారు. సోమవారం టెంపుల్ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, అర్చకుడు మల్లికార్జున్ కు విరాళం డబ్బులు అందజేసి రశీదు తీసుకున్నారు.

ఈ సందర్బంగా టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలే ముఖ్యమన్నారు. దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు, డీసీసీ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనలతో ఆలయంలో త్వరలో 120 రూముల ధర్మశాల నిర్మాణంతో పాటు నాలుగు సులభ్​కాంప్లెక్స్  నిర్మాణం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈవో బుద్ధి శ్రీనివాస్, ధర్మకర్త అల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు.

మల్లన్న పదకొండో ఆదివారం ఆదాయం రూ.55,60, 488

మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదకొండో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.55,60, 488 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం రూ.3,68, 684 ఆదివారం రూ.51,91,804 రాగా సోమవారం మరో రూ. 6,00,000 వస్తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ బుకింగ్ ఇన్‌చార్జి అధికారి నర్సింహులు తెలిపారు.