ఓపెన్ వర్సిటీకి ఆగస్టు 30 లోగా దరఖాస్తు చేసుకోండి : వర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్

ఓపెన్ వర్సిటీకి ఆగస్టు 30 లోగా దరఖాస్తు చేసుకోండి : వర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్

నల్గొండ అర్బన్, వెలుగు: 2025–-26 విద్యా సంవత్సరానికి గానూ డాక్టర్ బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ సూచించారు. ఆదివారం నల్గొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ ఫీజులతో వర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

 సమత ఫ్రీషిప్​ద్వారా ఆదివాసీలు, ఆదిమ తెగలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వికలాంగులకు ఉచిత విద్యనందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, ‌ఐటీఐ, ఓపెన్‌ ఇంటర్‌,  పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైనవారు అడ్మిషన్‌ తీసుకోవాలన్నారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని, ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని చెప్పారు. డిగ్రీ, పీజీ రెండో, మూడో సంవత్సర విద్యార్థులు ట్యూషన్‌‌ ఫీజు చెల్లించాలన్నారు. రీజినల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, ఎన్​జీ కాలేజీ అకాడమిక్​కోఆర్డినేటర్ రవి తదితరులున్నారు.