
ఖైరతాబాద్, వెలుగు : కార్టూన్అనేది స్పీచ్ కంటే షార్ప్‌గా ఉంటుందని సినీ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ అన్నారు. ఓటు కోసం డబ్బులు తీసుకోవడం నేరమేనని.. అయితే ఇచ్చిన వాడు కూడా నేరం చేస్తున్నట్లేనని పేర్కొన్నారు. కార్టూన్ల ద్వారా ఓటర్లను చైతన్య పరిచేందుకు కార్టూనిస్టులంతా వివిధ రూపాల్లో కార్టూన్లు వేసి సోమాజిగూడ ప్రెస్క్లబ్ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు.
‘ఆర్ట్ఫర్డెమోక్రసీ ఎగైనిస్ట్ఓట్బ్రైబరీ’ పేరుతో నిర్వహించిన ప్రదర్శనను రాంగోపాల్‌వర్మ చూశారు. ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డబ్బున్నవారు ఓటు వేసేందుకు డబ్బుతీసుకోవద్దు..అయితే డబ్బులేనోళ్లైతే ఆ డబ్బు తీసుకొని వాళ్లకు అనుకూలమైన వారికి ఓటు వేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ప్రెస్క్లబ్అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.