జిన్ పింగ్ తో మాట్లాడాలన్న ఆసక్తి లేదు

జిన్ పింగ్ తో మాట్లాడాలన్న ఆసక్తి లేదు
  • అవసరమైతే చైనాతో ట్రేడ్ రిలేషన్స్ కూడా వదులుకుంటామన్న ట్రంప్

వాషింగ్టన్ : కరోనా తో తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్న అమెరికా దానికి కారణం చైనాయేనన్న కోపంలో ఉంది. ఇప్పటికే పలుమార్లు కరోనా వ్యాప్తికి చైనా, డబ్ల్యూహెచ్ఓ కారణమంటూ పలుమార్లు కామెంట్లు చేసిన ట్రంప్ ఇంకా కోపం పెరిగింది. అమెరికా తీవ్రంగా నష్టపోయేందుకు కారణమైన చైనాతో ట్రేడ్ రిలేషన్స్ కూడా తెగదెంపులు చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. డ్రాగన్ కంట్రీతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. చైనా తో ట్రేడ్ రిలేషన్స్ కు సంబంధించి చాలా చేయాల్సి ఉందని…అసలు వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవటమే ఉత్తమమని ఆయన అన్నారు. అసలు చైనాతో ట్రేడ్ రిలేషన్ ను తెగతెంపులు చేసుకుంటే అమెరికా దాదాపు 50 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా చైనా చాలా ప్రయోజనాలను పొందుతుందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ వాదనను మరింత పెంచారు. అదే విధంగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో ప్రస్తుతం మాట్లాడాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. చైనా కంపెనీల్లో ‘అమెరికన్‌ పెన్షన్‌ ఫండ్‌’ ఏదైతే పెట్టుబడులుగా పెట్టామో వాటిని తిరిగి వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. చైనా నుంచి వేల కోట్ల డాలర్లు వెనక్కి రప్పిస్తున్నా అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టైన అన్ని కంపెనీల లెక్కలను ఇక నుంచి ఆరా తీస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా పై అమెరికా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ముందే అలర్ట్ చేసి ఉంటే ప్రపంచమంతా ఇలాంటి సంక్షోభం ఎదుర్కొనేది కాదంటూ ట్రంప్ ఫైరయ్యారు.