పద్దెనిమిదేండ్లు పైబడిన అందరికీ టీకా వేయండి

పద్దెనిమిదేండ్లు పైబడిన అందరికీ టీకా వేయండి

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. ‘‘వ్యాక్సినేషన్, రూల్స్ ఫాలో అవడం.. ఇవి రెండే కరోనాపై పోరాటంలో మనకున్న ఆయుధాలు. వైరస్​ పూర్తిగా అంతమయ్యే వరకూ వీటిని మరవొద్దు” అని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్ మినిస్టర్లతో గురువారం  ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా ఇంకా పోలేదని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  వ్యాక్సినేషన్ డ్రైవ్ ‘‘హర్ ఘర్ దస్తక్”లో భాగంగా దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 79% మంది ఫస్ట్ డోస్, 38% మంది సెకండ్ డోస్ వేసుకున్నారని తెలిపారు. అయితే 12 కోట్ల మంది సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉందని, వాళ్లందరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.