చెన్నూరు నియోజకవర్గం పొన్నారంలో తలుపులు వేసి ఓటింగ్.. నిలదీసిన కాంగ్రెస్

చెన్నూరు నియోజకవర్గం పొన్నారంలో తలుపులు వేసి ఓటింగ్.. నిలదీసిన కాంగ్రెస్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని పొన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ 160లో ఎన్నికల అధికారులు తలుపులు పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా.. ఓటర్లను కంట్రోల్ చేయలేక డోర్స్ వేసి నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కృష్ణ.. ఎన్నికల అధికారుల తీరుపై మండిపడ్డారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులను ప్రశ్నించారు. అనంతరం ఈ అంశంపై ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేస్తామని తెలిపారు.

పొన్నారం గ్రామంలోని 160వ పోలింగ్ బూత్ లో పోలీసులతో సహా ఎలక్షన్ అధికారులు లోపల్నుంచి తలుపులు పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్నారని వంశీ కృష్ణ ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. తాము ఓటర్లను కంట్రోల్ చేయలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. ఇది ఎన్నికల కమిషన్ అత్యంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లు తమ ఫోన్లపై లోగోలతో, సీక్రెట్ కెమెరాలతో వీడియోలు కూడా తీస్తున్నారని, వాళ్లనెవ్వరూ ఆపడం లేదని వంశీ చెప్పారు. ఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంపై అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అంతకుముందు మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, బంజారాహిల్స్ నందినగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఓటు వేశారు.